బీఎస్ యడ్యూరప్ప, శ్రీరాములు రాజీనామా: ఆమోదించిన స్పీకర్
బెంగళూరు/న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో యడ్యూరప్ప, శ్రీరాములు ఘన విజయం సాధించారు. ఈ నేపథ్యంలో వారు తమ తమ పార్లమెంటు సభ్యత్వాలకు రాజీనామా చేశారు. వారి రాజీనామాలను లోకసభ స్పీకర్ శనివార ఆమోదించారు.
కాగా, కాసేపట్లో బలపరీక్ష నిర్వహించనున్ననేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బీజేపీ బలపరీక్షలో నెగ్గుతుందా లేదా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్, జేడీఎస్‌లు తమ ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళ్లకుండా కాపాడుకునే పనుల్లో ఉన్నారు.

అయితే కాంగ్రెస్, జేడీఎస్‌లకు చెందిన లింగాయత్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలపైనే అందరి దృష్టి ఉంది. కాంగ్రెస్‌లో 18మంది, జేడీఎస్‌లో ఇద్దరు లింగాయత్ ఎమ్మెల్యేలు ఉన్నారు. బలపరీక్ష సమయంలో లింగాయత్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడి యడ్యూరప్పకు మద్దతుగా ఓటేస్తారా అనే అనుమానాలు ఉన్నాయి.
కాంగ్రెస్ వైఖరి పట్ల లింగాయత్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఇప్పటికే అసంతృప్తితో ఉన్నారని, గతంలో తమ వర్గాన్ని విడదీసేందుకు ప్రయత్నించడమే కాకుండా ఇప్పుడు లింగాయత్‌కు వ్యతిరేకంగా భావిస్తున్న జేడీఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడంతో వారు నిరాశ చెందారని బీజేపీ నేతలు చెబుతున్నారు.
గవర్నర్ అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడంతో యడ్యూరప్ప సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆయన తమ మనస్సాక్షి ప్రకారం శాసనసభ్యులు బలపరీక్షలో ఓట్లు వేయాలని కోరారు.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్‌ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications