చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శవ పేటికల తయారీలో ఆ కంపెనీ ప్రఖ్యాతి, జయకు ప్రత్యేక పేటిక

శవపేటికలను తయారుచేయడంలో ఫ్లెయింగ్ స్వ్వాడ్ అండ్ హైమాజ్ కంపెనీ ప్రసిద్ది చెందింది, రాజకీయనాయకులు, విఐపిలు, సినీ ప్రముఖులు ఈ కంపెనీ తయారు చేసిన శవపేటీకల్లోనే ఖననం చేశారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

చెన్నై :దేశంలో ప్రముఖులు చనిపోతే వారి పార్థీవదేహాలను ఖననం చేసేందుకు ఒకే కంపెనీ శవపేటీకలను సరఫరాచేసింది. దేశంలోని సుమారు ఐదువందల మంది ప్రముఖులకు ఈ కంపెనీయే శవపేటీకలను అందించింది. రాజకీయనాయకులు, సినీ ప్రముఖులతో పాటు దేశంలో పేరుమోసినవారందరీకీ ఈ కంపెనీయే శవపేటికలను తయారు చేసి ఇచ్చింది.

స్వర్గీయ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పార్థీవ దేహాన్ని ఖననం చేసేందుకు కూడ ఇదే కంపెనీ శవపేటీకలను తయారు చేసి ఇచ్చింది. జయ కోసం ప్రత్యేకంగా గంధపు చెక్కలతో శవపేటీకలను తయారు చేశారు. ఇప్పటివరకు సుమారు ఐదువందల మందికి ఈ కంపెనీ శవపేటీకలను తయారు చేసి ఇచ్చింది.

 special coffin for jaya made by famous company

నాడు పివి నరసింహరావు చనిపోయిన సమయంలో కూడ ఆయన పార్థీవదేహాన్ని ఈ కంపెనీ తయారు చేసిన శవపేటీకలోనే హైద్రాబాద్ కు తరలించారు. మరో వైపు జయలలిత, సినీనటులు శివాజీ గణేశన్, మనోరమ తదితర ప్రముఖులకు ఇదే కంపెనీ శవపేటీకలను తయారు చేసింది.అయితే ఈ శవపేటీకలో హెవీ డ్యూీ కంప్రెయిజర్, ఫ్రీజర్ బాక్స్ ను ఏర్పాటు చశారు. దీని వల్ల పార్థీవ దేహం తొందరగా చెడిపోకుండా ఉంటుందని నిర్వహకులు చెప్పారు.

ఫ్లైయింగ్ స్వ్కాడ్ అండ్ హైమేజ్ కంపెనీ ఈ శవపేటికలను తయారు చేస్తారు. జయలలిత చనిపోయిన వెంటనే ఇదే కంపెనీకి శవపేటిక తయారు చేసేందుకు ఆర్డర్ ఇచ్చారు. 0 నుండి 5 డిగ్రీల మద్య ఉష్ణోగ్రతను కొనసాగిస్తే పార్థీవదేహనికి చెడిపోయే అవకాశం ఉండదని నిపుణులు చెబుతున్నారు.1994 లో శవపేటీకలను తయారు చేసే హక్కును ఈ సంస్థ పొందింది. నాటి నుండి ఇప్పటివరకు ప్రముఖులకు ఈ కంపెనీ శవపేటీలకను తయారు చేస్తోంది.ఇప్పటికీ ఐదువందల మంది ప్రముఖుల పార్థీవదేహాలు ఈ కంపెనీ తయారు చేసిన శవపేటికలోనే ఖననం చేశారు.

English summary
flying squad and himage company famous for make coffin. from the 1994 to till now this company made around 500 coffins. this coffins especially for vips, cine actors, political leaders, vips. flying company made for jay deadbody.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X