అయోధ్య మహోజ్వల ఘట్టానికి హాజరైన వారికి ప్రత్యేక బహుమతులు..
ఈ నెల 22న అయోధ్య రామాలయంలో బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన ఎంతో ఘనంగా జరిగింది. హిందువుల ఎన్నో శతాబ్దాల కల నిన్నటితో నెరవేరింది. దేశమంతా రామనామస్మరణం నెలకొంది. ఈ వేడుకకు ఎంతో మంది ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరయ్యారు. సోమవారం నాడు మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో అద్భుతమైన ముహుర్తంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన దేశ ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా జరిగింది. ఈ ప్రతిష్టాపన వేడుకను కనులారా వీక్షించేందుకు అతిరథమహురథులంతా విచ్చేశారు. అయితే, ఈ మహత్తర కార్యక్రమానికి హాజరయిన అతిథులందరికీ ప్రత్యేక బహుమతులను అందజేశారు.
అయోధ్య వేడుకను వీక్షించేందుకు దేశవిదేశాల నుంచి ప్రముఖులు హాజరయ్యారు. అయోధ్య వేడుకకు హాజరయ్యేందుకు మొత్తం 11వేలమందికి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర టస్ట్ ఆహ్వానాలు అందించింది. అందులో సుమారు ఏడువేలమంది ప్రముఖులకు ఆహ్వానపత్రికలు అందాయి. వీరిలో సినీతారలు, ప్రముఖులు, రాజకీయ నాయకులు చాలామంది ఉన్నారు. ఇక, ఈ వేడుకకు బాలీవుడ్ స్టార్ హీరోలు, హీరోయిన్లు హాజరయి అయోధ్యకు మరింత అందాన్ని తెచ్చిపెట్టారు. అందులో బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్‌బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఆలియా, రణబీర్, కత్రినాకైఫ్, విక్కికౌశల్, కంగనారనౌత్ పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఇక, టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్ హాజరయ్యారు. క్రీడా రంగానికి చెందిన ప్రముఖులు కూడా ఈ వేడుకకు హాజరవ్వడం జరిగింది. అందులో ముందుగా సచిన్ టెండూల్కర్ హాజరయ్యరు. రవీంద్ర జడేజా, అనిల్ కుంబ్లే, మిథాలీ రాజ్ అక్కడికి అయోధ్య వేడుకకు హాజరయ్యారు. అనిల్ కుంబ్లే తన భార్యతో కలసి అయోధ్య శ్రీరాముని దర్శనం చేసుకున్నాడు.

ఆ సంచిలో ఉండే ప్రసాదాలు ఇవే :ఈ కార్యక్రమంలో హాజరయిన అతిథులందరికి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రత్యేక ప్రసాదంతో పాటు బహుమతులను కూడా అందించింది. వేడుకకు హాజరయిన వారికి ఇచ్చిన బహుమతులో లఖ్ నవూలో తయారు చేయించిన స్వీట్ బాక్సులతో పాటు కొన్ని వస్తువులను ఓ సంచిలో పెట్టి అతిథులకు అందజేయడం జరిగింది. ఇక, వారికిచ్చిన సంచిలో ఎముందన్న విషయం అందరికి తెలుసుకోవాలనే ఆసక్తి రేకెత్తిస్తుంది. వారికిచ్చిన సంచిలో కొత్త దేవాలయంతోపాటు బాలరాముడి అవతారంలో గ్రాఫిక్ చిత్రాన్ని ముద్రించడం జరిగింది. ఇందులో అయోధ్యపై పుస్తకం, దీపం కుంది, తలసిమాల, శ్రీరాముడి పేరుతో ఉన్న కండువా కూడా ఉన్నాయి. వీటితో పాటు ఆ సంచిలో నేతితో చేసిన నాలుగు లడ్డూలు, బెల్లం మిఠాయి, రామదాన చిక్కీ, జీడిపప్పు, కిస్మిస్ లు ప్రసాదంగా అందించారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications