వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Mi-17V-5- రష్యా మేడ్ సైనిక రవాణా హెలికాఫ్టర్-2013 నుంచి కొనుగోళ్లు-ప్రత్యేకతలివే

|
Google Oneindia TeluguNews

ఇవాళ తమిళనాడులో ప్రమాదానికి గురైన ఆర్మీ హెలికాఫ్టర్ ఎంఐ 17 వీ5కి మిలటరీ రవాణా హెలికాఫ్టర్. మిలటరీ అవసరాల కోసం దీన్ని వాడుతున్నారు. రష్యా తయారీ హెలికాఫ్టర్ అయిన ఎంఐ 17వీ5లో ఇవాళ త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ ప్రయాణించారు. ఆయనతో పాటు మొత్తం 14 మంది ప్రయాణించగా..ప్రమాదంలో 11 మంది అక్కడికక్కడే చనిపోయారు. దీంతో ఈ విమానం గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

 ఎంఐ 17వీ5 హెలికాఫ్టర్

ఎంఐ 17వీ5 హెలికాఫ్టర్

Mi-17V-5 హెలికాఫ్టర్ ను దేశీయంగా Mi-8MTV-5గా పేర్కొంటారు. Mi-8/17 హెలికాప్టర్‌ల సిరీస్ా కు చెందిన సైనిక రవాణా వేరియంట్ ఇది. రష్యన్ హెలికాఫ్టర్ల సంస్ధ కజాన్ హెలికాప్టర్స్ దీన్ని తయారు చేసింది. 2012లో భారత్ దీన్ని రష్యా నుంచి కొనుగోలు చేసింది. అప్పటి నుంచి సైనిక రవాణా అవసరాలకు దీన్ని వాడుతున్నారు. సైన్యం ఒకచోట నుంచి మరో చోటికి సామాగ్రి, ఆయుధాలు, ఇతర వస్తువులను తరలించేందుకు, భద్రతా బలగాలను తరలించేందుకు కూడా వీటిని వాడుతున్నారు. ఇందులో ఒకటైన విమానం ఇవాళ తమిళనాడులోని కూనూర్ లో కుప్పకూలింది.

ఎంఐ 17వీ5 ప్రత్యేకతలివే

ఎంఐ 17వీ5 ప్రత్యేకతలివే

ఎంఐ 17వీ5 హెలికాఫ్టర్ కు చాలా ప్రత్యేకతలు ఉన్నమాయి. దీని క్యాబిన్ లోపల, బయట కూడా కార్గోను రవాణా చేయడానికి వీలుంది. అలాగే Mi-17V-5 ప్రపంచంలోని అత్యంత అధునాతన రవాణా హెలికాప్టర్లలో ఒకటి. ఇది భద్రతా బలగాలు, ఆయుధాల రవాణా, ఫైర్ సపోర్ట్, కాన్వాయ్ ఎస్కార్ట్, పెట్రోలింగ్, సెర్చ్ అండ్ రెస్క్యూ (SAR) మిషన్లలో కూడా వాడుతున్నారు. ప్రస్తుతం భారత్ యుద్ధ అవసరాలను ఇది తీరుస్తోంది. సరిహద్దుల్లో కాపలా కాస్తున్న భద్రతా బలగాలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతోంది.

 రష్యా నుంచి దిగుమతి

రష్యా నుంచి దిగుమతి

డిసెంబర్ 2008లో 80 హెలికాప్టర్ల కోసం రష్యన్ హెలికాప్టర్‌లకు $1.3 బిలియన్ల కాంట్రాక్ట్‌ను ఇచ్చింది. 2013 ప్రారంభంలో 36 హెలికాప్టర్లు డెలివరీ చేయడంతో 2011లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF)కి డెలివరీలు ప్రారంభమయ్యాయి. 2013 ఫిబ్రవరిలో జరిగిన ఏరో ఇండియా షో సందర్భంగా రక్షణ శాఖ 12 ఎంఐ17వీ5 హెలికాప్టర్ల కోసం ఆర్డర్ చేసింది. భారత్ కు ఈ హెలికాఫ్టర్లను సరఫరాచేసేందుకు రోసేబోరాన్ ఎక్స్పోర్ట్, రక్షణశాఖ 2013లో ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం 71 హెలికాఫ్టర్లను భారత్ కు రష్యా సరఫరా చేసింది. చివరిగా 2018 జూలైలో చివరి బ్యాచ్ హెలికాఫ్టర్లు భారత్ కు చేరాయి.
ఆ తర్వాత 2019లో మన ఎయిర్ ఫోర్స్... ఈ హెలికాఫ్టర్ల కోసం రిపేర్, ఓవర్ హాల్ సదుపాయాలు ఏర్పాటు చేసుకుంది.
అలాగే 2011లో ఆఫ్ఘనిస్తాన్ జాతీయ ఆర్మీకి 63 ఎంఐ-+17వీ5 హెలికాప్టర్‌ల డెలివరీ కోసం యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ రోసోబోరోనెక్స్‌పోర్ట్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. కజాన్ హెలికాప్టర్లు అక్టోబర్ 2014లో ఆప్ఘన్ ఆర్మీకి సరఫరా కూడా పూర్తి చేశాయి.

English summary
Mi-17V-5 military transport helicopter crashed today in coonoor is a russian made chopper with so many specialities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X