వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వ్యాక్సిన్ వేగం పెంచండి: ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలపై ఎన్నికల సంఘం, కీలక సూచనలు

|
Google Oneindia TeluguNews

న్యూడిల్లీ: వచ్చే ఏడాది దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తెలిసిందే. అయితే, గత కొద్ది వారాలుగా దేశంలో కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న క్రమంలో ఈ ఎన్నికలపై సందిగ్ధత నెలకొంది. ఇప్పటికే అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారాలను ప్రారంభించాయి. అయితే, భారీగా జనం సమూహాలు గుమిగూడుతుండటంతో కరోనా వ్యాప్తి ఎక్కువగా జరిగే అవకాశం ఉండటంతో ఎన్నికలు నిర్వహణపై తర్చనాభర్జనలు కొనసాగుతున్నాయి.

Recommended Video

2021 Year Ender: Major Political Events In 2021 | 2021 Politics Recall | Oneindia Telugu

అయితే, ఎన్నికల సంఘం మాత్రం ఎన్నికలను షెడ్యూల్ ప్రకారం నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రాజ్యాంగం ప్రకారమే కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలున్నాయని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఉత్తరప్రదేశ్ తోపాటు ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా రాష్ట్రాల్లో శాసనసభల పదవీకాలాలు ముగియడంతో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంి.

Speed up Covid vaccination in poll-bound 5 states, Election Commission tells Centre

2022 మార్చి-ఏప్రిల్ నెలల్లో ఈ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే కసరత్తులు ప్రారంభించింది. అంతేగాక, మరికొద్ది రోజుల్లో షెడ్యూల్ ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. అయితే, ఇదే సమయంలో దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఎన్నికలు వాయిదా వేయాలంటూ పలు వర్గాల నుంచి డిమాండ్లు, అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ క్రమంలోనే కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్వి ఇతర ముఖ్య అధికారులతో ఎన్నికల సంఘం సోమవారం సమావేశమైంది. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు, వ్యాక్సినేషన్ కవరేజ్ సంబంధిత వివరాలను ఈసీ అధికారులను అడిగి తెలుసుకుంది. ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాల్లో దాదాపు 100 శాతం తొలి డోసు పూర్తికాగా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 85 శాతం, మణిపూర్, పంజాబ్ రాష్ట్రాల్లో 80 శాతం వరకు తొలి డోసు పంపిణీ పూర్తయిందని అధికారులు ఈసీకి తెలిపారు.

ఈ క్రమంలో వ్యాక్సినేషన్ నెమ్మదిగా ఉన్న రాష్ట్రాల్లో వేగం పెంచాలని, అందరికీ వ్యాక్సిన్ పూర్తి చేయాలని ఈసీ సూచించింది. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో దాదాపు రెండు డోసులు 100 శాతం పూర్తయ్యేలా చూడాలని కోరింది.

English summary
Speed up Covid vaccination in poll-bound 5 states, Election Commission tells Centre.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X