వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్పైస్ జెట్ ఇష్యూ.. 14 మందికి గాయాలు.. విచారణ షురూ

|
Google Oneindia TeluguNews

నిన్న కుదుపునకు గురయిన స్పైస్ జెట్ విమానం క్షేమంగా గమ్య స్థానం చేరుకుంది. విమానం ముంబై నుంచి దుర్గాపూర్ వెళుతున్న సంగతి తెలిసిందే. అయితే విమానం దిగే సమయంలో ఈదురుగాలులతో కుదుపునకు గురయ్యింది. దీంతో విమానంలో గల లగేజీ బ్యాగులు ప్రయాణికులపై పడ్డ సంగతి తెలిసిందే.

ఘటనపై డీజీసీఏ చర్యలకు ఉపక్రమించింది. ఆ విమానంలో గల సిబ్బందిని తప్పించి.. మరో విమానంలో వారిని గమ్యస్థానానికి చేర్చింది. విమానం అందజేసిన మెయింటనెన్స్ కంట్రోల్ సెంటర్ ఆఫ్ స్పైస్ జెట్ విచారణలో జాప్యం జరుగుతుంది. నిన్న జరిగిన విమానం కుదుపుతో మిగతా విమానాలు కూడా మరోసారి పరిశీలించారు.

SpiceJet crew taken off roster after mid-air turbulence leaves 14 injured

ఘటన జరిగిన వెంటనే డీజీసీఏ విచారణకు ఆదేశించింది. విచారణ జరుగుతుందని.. ఆ తర్వాత తప్పు ఎవరిదీ అనే అంశంపై క్లారిటీ రానుంది. ఈ ఘటనలో తొలుత 40 మంది వరకు గాయపడ్డారని తెలిసింది. కానీ ఆ తర్వాత అదీ 14 మంది అని తెలిసింది. ముగ్గురు విమాన సిబ్బంది కూడా ఉన్నారు. వారికి తల, వెన్నెముక, భుజం, నుదురు భాగం, మొహంపై గాయాలు అయ్యాయి. ప్రస్తుతం ముగ్గురు ఆస్పత్రిలో ఉన్నారు. వారిలో ఇద్దరు ఐసీయూలో ఉంచి ట్రీట్ మెంట్ ఇస్తున్నారు. విమానం కుదుపునకు గురయ్యే సమయంలో 195 మంది ప్రయాణికులు.. ఆరు సిబ్బంది ఉన్నారు. ఘటనలో కొన్ని సీట్లు, హ్యాండ్ రెస్టులు, ఓవర్ హెడ్ డెకొరేటవివ్ ప్యానల్స్, క్యాబిన్ ఓవర్ హెడ్ బిన్ లాక్ దెబ్బతిన్నాయి.

స్పైస్ జెట్ విమానంలో ఒక కుదుపునకు గురయ్యింది. విమానం ల్యాండ్ అయ్యే సమయంలో భారీగా ఈదురుగాలులు వీచాయి. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లో గల గుర్గాపూర్ నజ్రుల్ ఇస్లాం ఎయిర్ పోర్టులో జరిగింది. అక్కడ ల్యాండ్ చేయడానికి ప్రయత్నించింది. ఆ సమయంలో క్యాబిన్ లాగేజీ ఫ్లైయర్స్‌పై పడింది. దీంతో విమానంలో ఉన్న వారు గాయపడ్డారు.

English summary
several passengers were injured after SpiceJet flight SG 945 from Mumbai to Durgapur in West Bengal experienced major mid-air turbulence when it got caught in a storm while descending.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X