భారత్ లో రైలు ప్రయాణం ఇంత దారుణమా ? షాకైన బ్రిటిషర్..! వైరల్ వీడియో..!

ప్రయాణికుల సౌలభ్యం కోసం భారతీయ రైల్వే ఎన్ని మార్పులు తీసుకొస్తున్నా..వారి వైఖరిలో మాత్రం మార్పు రావడం లేదు. ముఖ్యంగా రైలు ప్రయాణాలు చేసేటప్పుడు తూటు ప్రయాణికుల గురించి అస్సలు ఆలోచించకుండా తాము ఏం చేయాలనుకుంటున్నారో చేసేస్తున్నారు. తమ చేష్టల వల్ల ఇతర ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నా పట్టించుకోవడం లేదు. అంతే కాదు ప్రశ్నిస్తే ఎదురుతిరిగి దాడులు చేసేలా ఉన్నారు. ఇలాంటిదే ఓ అనుభవం బ్రిటన్ నుంచి భారత్ కు వచ్చిన ఓ ప్రయాణికుడికి ఎదురైంది.

భారత్ కు ఇతర దేశాల నుంచి వచ్చే పర్యాటకులు ఇక్కడి ప్రదేశాలు, అందాల గురించిన వీడియోలు చేసి సోషల్ మీడియాలో పెడుతుంటారు. కానీ తాజాగా బ్రిటన్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు మాత్రం తనకు రైలు ప్రయాణం సందర్భంగా ఎదురైన చేదు అనుభవాన్ని ఇలా వీడియో తీసి ఇన్ స్టా లో పెట్టాడు. దీంతో ఆ వీడియో చూసిన వారంతా అవాక్కవుతున్నారు. భారతీయ రైళ్లలో ఇలాంటి ప్రయాణికులు కూడా ఉంటారా, ప్రయాణాలు ఇంత నరకంగా ఉంటాయా అనుకుంటున్నారు.

Spit on Me UK Vlogger Details Awful Indian Train Experience in Viral Video

తాజాగా యూకే నుంచి వచ్చిన ఓ వ్లాగర్‌కు భారత్ లో రైలు ప్రయాణం ఇబ్బందికరంగా మారింది. దీంతో ఇన్‌స్టాగ్రామ్‌లో తన ప్రయాణ అనుభవాల్ని పంచుకునే "బ్యాక్‌ప్యాకర్ బెన్" ఇటీవల ఒక వీడియోను పోస్ట్ చేశాడు. అందులో భారతదేశంలో తాను చేసిన "భయంకరమైన" రైలు ప్రయాణంలో ఎదురైన అసౌకర్య సంఘటనలను వివరించాడు.తన ఎదురుగా కూర్చున్న ఓ తోటి ప్రయాణికుడు బెన్ సీటుపై పదేపదే కాలు పెట్టాడు. కాళ్లు తీయమని అడిగితే అతను నవ్వి ఇవేవీ పట్టించుకోకుండా మరో రెండు నిమిషాల తర్వాత తిరిగి అక్కడే కాళ్లు పెట్టి కూర్చున్నాడని బ్రిటిష్ వ్లాగర్ తన వీడియోలో చూపించాడు.

Spit on Me UK Vlogger Details Awful Indian Train Experience in Viral Video

ఈ వీడియోలో బెన్ తాను ఎక్కిన రైలు కంపార్ట్‌మెంట్‌ను, కీరా దోసకాయలు అమ్ముతున్న విక్రేతను చూపిస్తాడు. ఈ భయంకరమైన పరిస్థితి మరింత తీవ్రమైందని బెన్ ఆరోపించాడు, ఎందుకంటే ఓ ప్రయాణికుడు తన నా చేతిపై ఉమ్మివేశాడని బెన్ తెలిపాడు. అతను ఈ దోసకాయలను నములుతున్నాడు, అదే సమయంలో తన వైపు చూసి ఏదో అన్నాడని తెలిపాడు. అతను నమిలిన దోస తన చేతిపై పడిందన్నారు. బెన్ అనుభవం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. చాలా మంది యూజర్లు అతనిపై సానుభూతి ప్రకటిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+