భావండీలో తెలుగోడి కథ..!

15 వ శతాబ్ధంలో భీవండి - కళ్యాణ్ మొదట నిజాంషాహీల పాలనలో అటు తరువాత ఆదిలాజాహీ పాలనలో ఉంది. కీ॥శ॥ 1657 లో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజు బీజాపూర్ యొక్క సుల్తాన్ ఆదిల్షాహాను ఓడించి భివండీని అధికారంలోకి తీసుకున్నాడు. అప్పుడు "అర్నాల" మరియు "మావులీ" కోటలు మొగలుల అధికారంలో యుండెను. ఈ కోటలను శివాజీ మహారాజ్ భివండీలోని 5000 సైనికులను తయారు చేసి ఈ ఓద రేవునుండి 1670 లో దండెత్తి మొగలుల మీద విజయము సాధించి తన ఆధీనంలోకి తీసుకున్నాడు. తరువాత మళ్లీ ఈ ప్రదేశం ఔరంగజేబు అధికారంలోకి వచ్చింది. 1729 లో మొదటి బాజీరావ్ యొక్క మేనల్లుడు ఛాస్కర్ జోషి మళ్లీ స్వరాజ్యంలోకి తీసుకున్నాడు. ఆ తరువాత 1817 లో భీవండి బ్రిటీష్ వాళ్ల అధికారంలోకి వచ్చింది. 1864 అక్టోబర్ 10న భివండీ మరియు నిజాంపూర అనుగ్రామాలను కలిపి మున్సిపాల్టిగా ఏర్పాటు చేసినారు.

ముంబాయికి 50 కి.మీ. దూరంలో ముంబాయినుండి నాసిక్ వెళ్లే ఆగ్రా రోడ్ కిరువైపున భివండీ పట్టణం వ్యాపించి ఉంది. భివండేకి 30 కి.మీ. దూరంలో వజ్రేశ్వరి మందిర తీర్థస్థానం కలదు. ముంబయి నుండి తరచుగా ఈ తీర్థస్థానమునకు వేళ్లే తెలుగువారు భీవండిలో నివసిస్తున్న తెలుగువారితో పరిచయం పెంచుకున్నారు. వీరందరు జౌళీ మిల్లుల పద్మశాలి నేత కార్మికులు కావడంచే భివండీలో పద్మశాలీయులు నడిపించే చేనేత మగ్గములపై ఆసక్తి పెంచుకొని ఇక్కడే స్థిర పదాలనుకున్నారు. 1840 లో తెలంగాణ లోని చేనేత పరిశ్రమ కుంటుపడినప్పుడు మరియు కొందరి భూస్వాముల అత్యాచారాలు జరిగినప్పుడు భయడపడి మహారాష్ట్రంలో చేనేత పరిశ్రమలు నడుస్తున్న వివిధ ప్రాంతాలకు వలసవెళ్లి స్థిరపడినారు. ఈ విధంగా వలసవెళ్లి అహ్మద్ నగర్లో స్థిరపడినవారిలోని తొమ్మిది కుటుంబాల వారు శ్రీ అరకల్ నారాయణ, దూస నారాయణ, అన్నం రుక్మాజీ, తమ్మల్ దత్తాద్రి తన్నీరు బుగ్గయ్య, జట్ల బాలయ్య గాజుల విరోఐ, వల్లాల్ భూమయ్య, గెంట్యాల బుచ్చయ్య గార్లు 1920 లో భివండీకి వచ్చి చేతి మగ్గాలపై బట్టలు నేయుచూ స్థిరపడినారు.

Sri Akhila Padmashali Society is named after Bhiwandi

1935 లో షోలాపూర్ పితామహ శ్రీ వడ్డెపెల్లి విరోబగారు ఆ తరువాత శ్రీ గుంటుక నర్సయ్య పంతులు గారు పద్మశాలీయుల సంఘ స్థాపన ఆవశ్యకత గురించి సలహానిచ్చారు. వారి సలహా ప్రకారం 1937 లో 250 మందితో సమావేశమును జరిపి పద్మశాలి యువక సంఘాన్ని స్థాపించడం జరిగింది. సంస్థాపక అధ్యక్షునిగా శ్రీ సూలకుంట్ల తుకారాం గారిని ఎన్నుకోవడం జరిగింది. 1941 లో 'భృగువంశ పద్మశాలి సంఘం' అను పేరుతో మరో సంస్థ ఏర్పడినది. దానికి శ్రీ గూడూరి హనుమంతు అధ్యక్షులుగా వ్యవహరించిరి. 1951 లో భృగువంశ పద్మశాలి సంఘమునకు శ్రీ కందుల సిద్రాం అధ్యక్షులయ్యారు.

తరువాత భృగువంశ పద్మశాలి సంఘం పేరు మార్చి శ్రీ అఖిల పద్మశాలి సమాజం భీవండి అను పేరు పెట్ట బడినది. ఈ సమాజమునకు సూలకుంట్ల తుకారాంగారు అధ్యక్షులుగా ఎన్నుకొనబడిరి. ఆ తరువాత ఇప్పటివరకు ఎందరో సమాజం యొక్క పెద్దలు వివిధ పదవులను అలంకరించారు. వారిలో వడ్లకొండ వెంకటేశం, వల్లాల్ రామయ్య, కమటం శంకర్, వేముల నర్సయ్య, అధ్యక్షులుగా ఉందిరి ఇప్పుడు పొట్టబత్తిని రామకృష్ణ అధ్యక్షులయినారు.

1941 లో స్వాతంత్ర్య సంగ్రామం మరియు 1942 లో 'చలేజావ్' ఉద్యమములో శ్రీ వల్లాల రామయ్యతో సహా భీవండి తెలుగు ప్రజలు కూడా దురుకుగా పాల్గొన్నారు. శ్రీ పల్లాల రామయ్యగారు స్వాతంత్య్ర పోరాటంలో సత్యాగ్రహం చేసి 9 మాసములు జైలు శిక్షననుభవించారు. 'చలేజావ్' ఉద్యమములో పాల్గొని 6 మాసముల జైలు శిక్ష సనుభవించారు. తెలుగువారి వలసలు దినదినాభివృద్ధి చెందుతూ భీవండిలో గల 85 వేల జనాభాలో తెలుగువారి సంఖ్య 500 లకు పెరిగింది. 1957 లో చేనేత స్థానములో మరమగ్గములను (పవర్లూంలు) ముంబాయి నుండి తెచ్చి భివండీలో స్థాపించడం ప్రారంభమైనది. తెలంగాణలోని కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్, నల్లగొండ మొదలగు జిల్లాలనుండి తెలుగువారు మరమగ్గాలపై పనిచేయుటకు వచ్చి ఇక్కడ జీవనం కొనసాగించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+