Ayodhya: అయోధ్యకు వెళ్తున్నారా.. ఇవి మర్చిపోకండి..!
భారతదేశం అంత ఇప్పుడు రామనామ స్మరణ చేస్తోంది. దేశంలోని ప్రతి ఇంటికి రామయ్య అక్షింతలు చేరాయి. రామయ్య మందిర ప్రారంభోత్సవానికి ఇంకా రెండు రోజులే సమయం ఉంది. ఎన్నో శతాబ్దాల ఎదురుచూపులకు తెరదించుతూ జనవరి 22 వ తేదీ అయోధ్యలో శ్రీరాముని మందిరాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. ఈ అద్వితీయ ఘట్టాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు అనేక మంది అతిథులకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానాలు పంపింది.
అయితే ప్రారంభోత్సవానికి హాజరయ్యే అతిథులకు ట్రస్టు కీలక సూచన చేసింది. ఎంట్రీ పాసులు ఉన్నవారికి మాత్రమే ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ కార్యక్రమం కోసం ఆహ్వానితులకు ఎంట్రీ పాసులు, క్యూఆర్ కోడ్‌లు శుక్రవారం నాడు అధికారికంగా విడుదల చేశారు. వీటిని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ఆహ్వానించబడిన విశిష్ట అతిథులకు వారి పేరుతో అందజేస్తారు.
Recommended Video


ఎంట్రీ పాసుపై ఉన్న క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసిన తర్వాతే వివరాలు సరిపోలితేనే అతిథులను లోపలికి అనుమతి ఇస్తారు భద్రతా సిబ్బంది. కేవలం ఆహ్వాన పత్రిక ద్వారానే కార్యక్రమానికి అనుమతి ఇవ్వలేమని భద్రతా రీత్యా ఈ క్యూఆర్ కోడ్ ఎంట్రీ జాగ్రత్తలు తీసుకున్నట్లు ట్రస్టు స్పష్టం చేసింది. ఇక సామాన్య భక్తులు కూడా ఆయోధ్యకు భారీగా చేరుకుంటున్నారు. దీంతో అక్కడ హోటల్, అద్దె గదుల ధరలు భారీగా పెరిగాయి.
అయోధ్యకు వెళ్లే భక్తుల కోసం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను కూడా నడుపుతోంది. పలు రాష్ట్రాల నుంచి అయోధ్యకు రైళ్లు నడవనున్నాయి. కాగా అయోధ్య రామమందిరాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు. అయోధ్య ఆలయంలో 42 బంగారు తలుపులను ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications