వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీదేవి మృతి: ఆ గంటలో ఏం జరిగింది, మృతదేహం తరలింపుకు ఇంకా 2 రోజులు?

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

Sridevi Passes Away: It's Not A Cardiac Arrest, Twist ?

న్యూఢిల్లీ:దుబాయ్‌లో మరణించిన శ్రీదేవి బౌతిక కాయం ముంబైకి తరలించడానికి ఇంకా రెండు మూడు రోజులు పట్టే అవకాశం ఉందని భారత దౌత్యాధికారులు అభిప్రాయపడుతున్నారు. కేసు తేలేవరకు తాము ఏం చేయలేమని భారత దౌత్యాధికారి నవదీప్ సూరి చెబుతున్నారు.

ఫిబ్రవరి 24వ, తేదిన దుబాయ్‌లోని హోటల్‌లో శ్రీదేవి మరణించింది. దుబాయ్ కాలమానం ప్రకారం శనివారం రాత్రి 10 గంటలకు ఆమె చనిపోయిందని సమాచారం.

శ్రీదేవి హెల్త్‌రిపోర్ట్స్ కోరిన దుబాయ్ పోలీసులు, బోనికపూర్ ఏం చెప్పాడు <br>శ్రీదేవి హెల్త్‌రిపోర్ట్స్ కోరిన దుబాయ్ పోలీసులు, బోనికపూర్ ఏం చెప్పాడు

దుబాయ్‌లో శ్రీదేవి మరణం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఆమె మరణంపై కొనసాగుతున్న మిస్టరీపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

ఆ నాలుగు రోజులు శ్రీదేవి ఏం చేసింది, అంతా మిస్టరీ?ఆ నాలుగు రోజులు శ్రీదేవి ఏం చేసింది, అంతా మిస్టరీ?

శ్రీదేవి మృతదేహం తరలింపుకు ఇంకా 2 రోజులు

శ్రీదేవి మృతదేహం తరలింపుకు ఇంకా 2 రోజులు

దుబాయ్‌ హోటల్‌లో మరణించిన ప్రముఖ నటి శ్రీదేవి మృతదేహం తరలింపుకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. మృతదేహం తరలింపులో ఇంకా రెండు లేదా మూడు రోజులు పట్టే అవకాశం ఉందని సమాచారం. ఈ మేరకు దుబాయ్‌లో భారత దౌత్యవేత్త నవదీప్ సూరి చెబుతున్నారని మీడియా వెల్లడించింది. శ్రీదేవి మృతి విషయమై స్పష్టత వచ్చాకే బౌతికకాయాన్ని అప్పగించనున్నారు.తమకు శ్రీదేవి మృతిపై స్పష్టత రావాల్సిన అవసరం ఉందని దుబాయ్ పోలీసులు భారత దౌత్యవేత్తకు సమాచారాన్ని పంపారు

ఆ గంటలో ఏం జరిగింది

ఆ గంటలో ఏం జరిగింది

ఫిబ్రవరి 24వ, తేది రాత్రి 10.01 నిమిషానికి చనిపోయిందని పోస్ట్ మార్టం నివేదిక చెబుతోంది. అయితే పోలీసులకు శ్రీదేవి మృతికి సంబంధించి శనివారం రాత్రి 9 గంటల సమయంలో ఫోన్ చేశారని ప్రచారం సాగుతోంది. అయితే ఆ గంటలో ఏం జరిగిందనేది ప్రస్తుతం కీలకంగా మారింది. ఈ గంటలో చోటు చేసుకొన్న పరిణామాల్లో వాస్తవాలు తేలితే శ్రీదేవి మృతిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని దుబాయ్ పోలీసులు భావిస్తున్నారు.

హోటల్ సిబ్బంది, బోనికపూర్‌ను ప్రశ్నించిన పోలీసులు

హోటల్ సిబ్బంది, బోనికపూర్‌ను ప్రశ్నించిన పోలీసులు

శ్రీదేవి బస చేసిన హోటల్ సిబ్బందిని, బోని కపూర్‌ను దుబాయ్ పోలీసులు విచారించారు. శ్రీదేవి మృతి ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.ఈ కేసులో వాస్తవాలను నిగ్గు తేల్చేందుకుు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. హోటల్ సీసీ టీవి పుటేజీని పరిశీలించారు. శ్రీదేవి, బోనికపూర్ ఫోన్ కాల్స్ డేటాను కూడ పోలీసులు విశ్లేషిస్తున్నారు. హోటల్‌ గదిని పోలీసులు సీజ్ చేశారు.

బోనికపూర్ ఎవరికీ ఫోన్ చేశారు

బోనికపూర్ ఎవరికీ ఫోన్ చేశారు

శ్రీదేవి మరణించిన తర్వాత బోనికపూర్ ఎవరికీ ఫోన్ చేశారనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎందుకు అతడికి ఫోన్ చేయాల్సిందనే విషయమై పోలీసులు బోని కపూర్‌ను ప్రశ్నించే అవకాశం ఉంది. ఈ కేసులో వాస్తవాలను తేల్చేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.

English summary
On February 24th, the industry received a major jolt after hearing about the death of the legendary actress Sridevi at the mere age of 54. While initially it was reported ‘cardiac arrest’ being the cause of death, according to forensic reports, the actress died to ‘accidental drowning’.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X