డెత్ మిస్టరీ: బోనీకపూర్ వివరణపై ప్రాసిక్యూషన్ అసంతృప్తి? 100 కోట్ల బీమా, శ్రీదేవి చనిపోతే లాభమెవరికి
Recommended Video

దుబాయ్/ముంబై: నటి శ్రీదేవి మృతి విషయంలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పోలీసులు వివిధ కోణాల్లో దర్యాఫ్తు చేస్తున్నారు. భర్త బోనీ పైన అనుమానాలు పెరుగుతున్నాయని మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
పోలీసులు ఆయనతో మాట్లాడిన తర్వాత అనుమానాలు మరింత బలపడ్డాయని చెబుతున్నారు. మేనల్లుడి పెళ్లిలో ఏం జరిగింది, ఏమైనా గొడవ జరిగిందా, అసలు మృతికి కారణాలు ఏమిటనే కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.

బోనీ వివరణపై ప్రాసిక్యూషన్ అసంతృప్తి
శ్రీదేవి పెళ్లి కోసం యూఏఈ వెళ్లారు. ఫిబ్రవరి 20న పెళ్లి జరిగింది. 24వ తేదీన ఆమె మృతి చెందారు. దీంతో ఈ నాలుగు రోజుల మధ్య ఏం జరిగింది, పెళ్లిలో ఏం జరిగింది అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. బోనీ కపూర్‌ను మరోసారి విచారించినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఆయన వివరణపై ప్రాసిక్యూషన్ అసంతృప్తి వ్యక్తం చేసిందని తెలుస్తోంది.

శ్రీదేవి తిరిగేందుకు కారు
శ్రీదేవి దుబాయ్‌లో ఉండటంతో ఆమె సన్నిహితులు లేదా అభిమానులు ఒకరు అక్కడ తిరిగేందుకు కారు కూడా ఇచ్చారని తెలుస్తోంది. మరోవైపు శ్రీదేవి కూతుళ్లు జాన్వీ, ఖుషీలు అనిల్ కపూర్ ఇంట్లో ఉన్నారు. వారి వద్దకు సెలబ్రిటీలు వచ్చి కలుస్తున్నారు.

తొందరపడకండి, క్లారిటీ రావాలి, భారత ఎంబసీకి పోలీసులు
శ్రీదేవి మృతదేహాన్ని వాళ్లు అప్పగించేదాకా మనం ఏం చేయలేమని యూఏఈలోని భారత దౌత్యవేత్త నిస్సహాయత వ్యక్తం చేశారు. దీనిపై దుబాయ్ పోలీసులు స్పందిస్తూ.. తొందరపడవద్దని, మాకు ఇంకా స్పష్టత రావాల్సి ఉందని భారత ఎంబసీకి వర్తమానం పంపించారు.

శ్రీదేవిపై రూ.100 కోట్ల ఇన్సురెన్స్?
శ్రీదేవి పైన రూ.100 కోట్ల ఇన్సురెన్స్ ఉన్నట్లుగా తెలుస్తోందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో శ్రీదేవి మృతితో లభపడేది ఎవరు అనే దిశలోను పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారని తెలుస్తోంది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రం ఆమె మృతదేహం కోసం ఎదురు చూస్తున్నారు. న్యాయపరమైన చిక్కులన్నీ వీడాకే మృతదేహాన్ని అప్పగిస్తారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications