హీరో ఆర్య పెళ్లి పేరుతో నన్ను మోసం చేశాడు... పోలీసులకు శ్రీలంక యువతి ఫిర్యాదు..

తమిళ హీరో ఆర్యపై విద్జ అనే ఓ శ్రీలంకన్ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని ఆరోపిస్తూ చెన్నై పోలీసులకు ఆన్‌లైన్‌ ద్వారా ఫిర్యాదు చేసింది. ఆర్య తన వద్ద నుంచి రూ.70లక్షలు తీసుకున్నట్లు ఆరోపించింది. ఆర్యతో వాట్సాప్ చాటింగ్‌కి సంబంధించిన స్క్రీన్ షాట్స్‌ను పోలీసులకు సమర్పించింది. దీనిపై పోలీసులు ఆర్యకు నోటీసులు జారీ చేయడంతో బుధవారం(అగస్టు 11) ఆయన చెన్నై పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు.

విద్జ ప్రస్తుతం జర్మనీలో ఉంటోంది. అక్కడి లాయర్ ద్వారానే ఆన్‌లైన్‌లో ఆర్యపై సైబర్ క్రైమ్‌కి ఫిర్యాదు చేసింది. నిజానికి గత వారమే దీనిపై కోర్టు విచారణ చేపట్టింది. ఆర్య నుంచి మరిన్ని వివరాలు రాబట్టాలని పోలీసులను ఆదేశించిన కోర్టు ఆగస్టు 17కి విచారణను వాయిదా వేసింది. కేసుకు సంబంధించిన వివరాలను రాబట్టేందుకు ఆర్యను విచారణకు హాజరుకావాల్సిందిగా పోలీసలు నోటీసులు జారీ చేశారు. దీంతో ఆర్య చెన్నై సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట హాజరయ్యారు. ఇన్‌స్పెక్టర్ గీతా ఆర్యను విచారించారు. దాదాపు 3 గంటల పాటు విచారణ కొనసాగింది. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

srilankan woman complaint against hero arya alleges he cheated her

హీరో ఆర్యకు 2019లో నటి సయ్యేషా సైగల్‌తో వివాహమైన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ జంటకు పాప పుట్టింది. గజినికాంత్ సినిమా షూటింగ్ సమయంలో ఆర్య,సైగల్ ప్రేమలో పడ్డారు. కొన్నేళ్ల ప్రేమ తర్వాత పెళ్లితో ఒక్కటయ్యారు. సయేషా సైగల్ తెలుగులో అక్కినేని అఖిల్‌తో కలిసి 'అఖిల్' సినిమాలో నటించింది. ఇక ఆర్య వాడు వీడు,రాజారాణి,వరుడు,సర్పట్టా తదితర సినిమాలతో తెలుగులోనూ మంచి ప్రేక్షకాదరణ సంపాదించుకున్నాడు.

ఇటీవల పా.రంజిత్ దర్శకత్వంలో వచ్చిన సర్పట్టా సినిమాతో ఆర్య మంచి హిట్ అందుకున్నాడు. సర్పట్టా 1970 దశకంలో ఉత్తర చెన్నైలో ఉన్న బాక్సింగ్‌ క్రీడాకారుల జీవితాన్ని ఇతి వృత్తంగా తెరకెక్కింది.సర్పట్టా పరంపర అంటే అణువణువునా అభిమానం ఉన్న సమర పాత్రలో ఆర్య పూర్తిగా లీనమైన నటించారు. సమర పాత్రకు తగిన బాడీ లాంగ్వేజ్,కండలు తిరిగిన దేహం కోసం ఆయన చాలానే కష్టపడ్డాడు. యాక్షన్, ఎమోషన్,కామెడీ ఇలా అన్నింటిని పండించేశాడు. సమర భార్యగా మంగమ్మ పాత్రలో దుషార విజయన్ పర్వాలేదనిపించింది. గురువు రంగయ్యగా పశుపతి ఆ పాత్రలో జీవించారు. జాన్ కొక్కెన్ వేటపులిగా అదరగొట్టేశాడు. రాముడు, వీర, డాడీ ఇలా మిగిలిన పాత్రధారులు కూడా చక్కగా నటించారు.ఓటీటీలో రిలీజ్ అయిన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+