రిసార్ట్ బాత్రూంలో దూరి తప్పించుకున్న ఎమ్మెల్యే: శశికళ వర్గంపై కేసు పెట్టి !
చెన్నై: అన్నాడీఎంకేకి చెందిన అందరూ శాసన సభ్యులను శశికళ వర్గీయులు నిర్బంధించారని, వారందరిని రక్షించాలని, తాను అక్కడి నుంచి తప్పించుకుని వచ్చానని ఆ పార్టీకి చెందిన సీనియర్ శాసన సభ్యుడు షణ్ముగనాథన్ శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
శివైకుందమ్ శాసన సభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అయిన షణ్మగనాథన్ శుక్రవారం శశికళ వర్గీయుల మీద చెన్నైలో పోలీసులకు ఫిర్యాదు చేసి జరిగి విషయం చెప్పారు. షణ్ముగనాథన్ మాట్లాడుతూ బుధవారం మద్నాహ్నం తాను చెన్నైలోని అన్నాడీఎంకే పార్టీ కార్యాలయంలో జరిగిన శాసనసభాపక్ష సమావేశానికి వెళ్లానని చెప్పారు.
అక్కడ సమావేశం పూర్తి అయిన తరువాత అందర్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో లగ్జరీ రిసార్ట్ దగ్గరకు తీసుకు వెళ్లారని అన్నారు. అక్కడ రాత్రి అందరికి విందు ఏర్పాటు చేశారని, అయితే తాను మధుమేహ వ్యాదితో బాధపడుతున్నందుకు అక్కడ జరిగే విందుకు వెళ్లకుండా గదిలోనే ఉండిపోయానని చెప్పారు.

అనంతరం ఎవర్వూ లేని సమయంలో తాను బాత్రూం కిటికీ నుంచి తప్పించుకుని సమీపంలోని రోడ్డు దగ్గరకు చేరుకుని ఎవ్వరికీ అనుమానం రాకుండా ఆర్టీసీ బస్సులో చెన్నై చేరుకున్నానని వివరించారు. తనతో పాటు తీసుకు వెళ్లిన ఎమ్మెల్యేలు అందరూ ఇప్పుడు రిసార్ట్ లోనే ఉన్నారని ఆయన ఆరోపించారు.
తానతో పాటు చాల మంది శాసన సభ్యులు పన్నీర్ సెల్వంకు మద్దతు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నారని, అయితే శశికళ వర్గీయులు వారిని నిర్బంధించారని అన్నాడీఎంకే ఎమ్మెల్యే షణ్మగనాథన్ మీడియాకు చెప్పారు. పోలీసులు ఆయన ఫిర్యాదును స్వీకరించి దర్యాప్తు చేస్తున్నారు.
-
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications