వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అత్యున్నత సేవలకు.. ఎస్ఆర్ఎల్ డయాగ్నస్టిక్ సెంటర్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : ఇండియాలో ప్రముఖ డయాగ్నోస్టిక్ సంస్థ అయిన సౌతర్న్ రీజియన్ ల్యాబోరేటరీస్ (ఎస్ఆర్ఎల్) గడిచిన మూడేళ్లలో దేశవ్యాప్తంగా నమోదైన ఆర్థరైటిస్ సంబంధిత రిపోర్టులను విడుదల చేసింది. రిపోర్టు ప్రకారం 10వేల సాంపిల్స్ నుంచి సేకరించిన రక్త నమూనాల్లో పలు అసాధారణ తేడాలను గుర్తించారు.

ఆస్టియోఆర్థరైటిస్ కు సంబంధించి.. రక్త నమూనాల్లో డైరెక్ట్, ఇండైరెక్ట్ స్థాయిల్లో తేడాలను గుర్తించారు. హెమటాయిడ్ ఆర్థరైట్స్, వాతరోగం మరియు హ్యూమాటిక్ ఫీవర్ కు సంబంధించిన రక్త నమూనాల్లోను తేడాలను గుర్తించారు. దేశవ్యాప్తంగా నాలుగు జోన్ల నుంచి సేకరించిన రక్త నమూనాల ద్వారా ఈ విషయాలను బేరీజు వేశారు.

సౌత్ జోన్ కు సంబంధించిన సాంపిల్స్ తో పోల్చి చూస్తే.. వెస్ట్ జోన్ నుంచి సేకరించిన సాంపిల్స్ లో ఎక్కువ తేడాలను గుర్తించారు.సౌత్ జోన్ కు సంబంధించిన సాంపిల్స్ లో యూరిక్ యాసిడ్, హోమటాయిడ్ ఆర్థరైటిస్ తేడాలు అంతగా లేనప్పటికీ.. వెస్ట్ జోన్ నమూనాల్లో హెమాయిటెడ్ ఫ్యాక్టర్ కు సంబంధించిన అసాధారణ తేడాలు బయటపడ్డాయి.

వాత రోగాలకు సంబంధించి యూరిక్ యాసిడ్ తీవ్రత సర్వ సాధారణంగా కనిపించే అంశం. రిపోర్టులు చెబుతున్న దాని ప్రకారం.. ఈస్ట్ జోన్ నుంచి సేకరించిన సాంపిల్స్ లో హెమటాయిడ్ ఫీవర్ కు సంబంధించి.. అతి ఎక్కువ యాంటీ స్ట్రెప్టోలైజిన్ 'ఓ' ఉన్నట్టు గుర్తించారు. క్రోనిక్ సంబంధిత రోగాల్లో.. క్రోనిక్ ఇన్ ఫ్లేమేషన్ అనేది శరీరంలో నిరంతరాయంగా జరుగుతున్నప్పుడు ఈఎస్ఆర్, సీఆర్పీ సాంపిల్స్ లెవల్స్ పెరుగుతాయి. దీనివల్లే చాలామంది ఆర్థరైటిస్ బారిన పడుతున్నట్టు గుర్తించారు.

మరిన్ని రిపోర్టులను పరిశీలిస్తే.. చాలామంది మగవాళ్లలో సీ-రియాక్టివ్ ప్రోటిన్ లెవల్స్ సాధారణంగా కనిపిస్తే.. ఆడవాళ్లలో ఎరిథ్రోకైట్, సెడిమెంటేషన్ వంటివి అసాధారణ స్థాయిలో ఉన్నట్టు తేల్చారు. డాక్టర్ లీనా చాటర్జీ దీనిపై స్పందిస్తూ..'ఎముక మరియు దానికి సంబంధించిన ఆరోగ్యం చాలా ముఖ్యమైనది. చాలామంది ఈ విషయాన్ని అంతగా పట్టించుకోరు. ఇండియాలో కొన్ని లక్షల జనాభా ఈ వ్యాధులతో బాధపడుతున్నారు. కానీ డాక్టర్లను సంప్రదించేవారు, చెకప్ లు చేయించుకునేవారు మాత్రం చాలా తక్కువ' అంటూ అభిప్రాయపడ్డారు.

delhi

రిపోర్టులు చెబుతున్న దాని ప్రకారం.. ఇండియాలో 15-17 శాతం జనాభా ఆస్టియోఆర్థరైటిస్ సమస్యలతో బాధపడుతున్నారు. నిజానికి గుండె మరియు క్యాన్సర్ వ్యాధులతో పోలిస్తే.. ఎముకలకు సంబంధించిన సమస్యలు చాలా సహజం. ఇదే విషయాన్ని లోతుగా విశ్లేషించడానికి గడిచిన మూడేళ్ల నివేదికలను సేకరించి ఆర్థరైటిస్ గురించి నొక్కి చెప్పడమే కాకుండా, రక్త పరీక్షల ద్వారా ఆర్థరైటిస్ తో పాటు మరికొన్ని సంబంధిత వ్యాధులను సులువుగా గుర్తించవచ్చునని ఎస్ఆర్ఎల్ వైద్యులు అభిప్రాయపడుతున్నారు.

ఎస్ఆర్ఎల్ డయాగ్నాస్టిక్స్ గురించి

ఎస్ఆర్ఎల్ భారత దేశంలో అతిపెద్ద డయాగ్నస్టిక్స్ సెంటర్. ఎస్ఆర్ఎల్ అత్యుత్తమ నాణ్యత కలిగిన ల్యాబ్స్, సేకరణ పాయింట్ల ద్వారా తమ కస్టమర్లను ఆకట్టుకునే విధంగా, అలాగే అత్యుత్తమ నాణ్యత కలిగిన డయాగ్నస్టిక్స్ సర్విస్‌ను అందిస్తోంది.

కస్టమర్లకు నాణ్యమైన, కచ్చితమైన టెస్టులు, సరసమైన ధరలకే అందించాలనే ఉద్దేశ్యంతో ఎస్ఆర్ఎల్ డయాగ్నస్టిక్స్ ప్రారంభించబడింది. ఎస్ఆర్ఎల్ డయాగ్నస్టిక్స్ సెంటర్ అందరి విశ్వాసాన్ని చూరగొంటూ అత్యుత్తమ నైతిక ప్రమాణాలకు పర్యాయపదంగా నిలిచింది. ఎస్ఆర్ఎల్ టీంలోని ప్రతి ఒక్కరు విలువలు పాటిస్తారు.

ఎస్ఆర్ఎల్ డయాగ్నస్టిక్స్ సెంటర్ *322 నెట్ వర్కింగ్ లాబోరేటరీస్ కలిగి ఉంది. అందులో *పది రిఫరెన్స్ ల్యాబ్స్. నాలుగు సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్. *26 రేడియాలజీ/ఇమేజింగ్ సెంటర్స్. *39 ఎన్‌బీఎల్ అక్రిడేటెడ్ ల్యాబ్స్. *4 క్యాప్ అక్రిడేటెడ్ ల్యాబ్స్. 7272కు పైగా కలెక్షన్ పాయింట్లు విస్తరించి ఉంది.

ఈ కంపెనీ దుబాయ్, శ్రీలంక, నేపాల్‌లలో ఎక్కువ ల్యాబ్స్ కలిగి ఉంది. అలాగే భారత్ కాకుండా, వివిధ దేశాలలో 58 కలెక్షన్ పాయింట్లు కలిగి ఉంది. భారత దేశంలోని మెడికల్ డయాగ్నస్టిక్స్ సెంటర్‌కు యదార్ధమైన మార్గదర్శక సంస్థ ఎస్ఆర్ఎల్ డయాగ్నస్టిక్స్ సెంటర్.

దీనిని 1995లో స్థాపించారు. గోల్డ్ స్టాండర్డ్ డయాగ్నస్టిక్స్ సర్వీస్ అందించాలనే మిషన్‌తో ఇది స్థాపించబడింది. లాబోరేటరీ మెడిసిన్, రేడియోలజీలలో గోల్డ్ స్టాండర్డ్ సేవలు అందించాలనేది ఎస్ఆర్ఎల్ ఉద్దేశ్యం.

ఒక్కరోజులో ఎస్ఆర్ఎల్ 1,25,000 సాంపిల్స్ ను పరీక్షించింది. తద్వారా తరుచూ వెల్లడైన విషయమేంటంటే.. మనిషి శరీరంలో 4వేల రకాల డయాగ్నోస్టిక్స్ పరీక్షలు నిరంతరాయంగా జరుగుతాయని తెలిసింది. మొత్తంగా 3800 టెస్టులను నిర్వహించి ఇండియాలోనే అతి ఎక్కువ ల్యాబోరేటరీ పరీక్షలను నిర్వహించిన సంస్థగా ఎస్ఆర్ఎల్ నిలిచింది.

భారత దేశంలో అత్యంత గుర్తింపు పొందిన ల్యాబ్ నెట్ వర్క్ ఎస్ఆర్ఎల్. 39 ఎన్ఏబీఎల్ అక్రిడేటెడ్, 4 సీఏపీ అక్రిడేటెడ్ ల్యాబ్స్‌తో కూడి ఉంది. అత్యంత ప్రత్యేకమైన సాంకేతికత, వినూత్న సేవలలో ముందుంటూ.. భారత దేశంలోనే డయాగ్నస్టిక్ సర్విసెస్‌లో ఇప్పటికీ ఎస్ఆర్ఎల్ విప్లవం తీసుకు వస్తోంది.

ఎస్ఆర్ఎల్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ డివిజన్ ఐఎస్ఓ సర్టిఫికెట్ పొందినది. అలాగే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క డిపార్టుమెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ గుర్తింపు పొందిన తొలి ప్రయివేటు సెక్టార్ ల్యాబ్. ఎస్ఆర్ఎల్ తన యొక్క విస్తృతమైన టెస్టుల ద్వారా నాణ్యమైన డయాగ్నస్టిక్, ప్రోగ్నోస్టిక్ మరియు మానిటరింగ్ సేవలను అందిస్తుంది. మల్టీ నేషనల్ అండ్ ఇండియన్ ఫార్మాస్యూటికల్ కంపెనీలు, సీఆర్వోస్ ఆండర్ టేకింగ్ ఫేజ్ III/ IV క్లినికల్ ట్రయల్ వర్క్ తదితరాలకు కూడా సేవలను అందిస్తుంది.

English summary
RL Diagnostics, a leading diagnostic chain in India, released a 3-year data analysis report on Arthritis related tests done on samples received in its labs from across India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X