వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రత్యక్ష రాజకీయాలు: స్టాలిన్ కుమారుడు ఎంట్రీ ?

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళ సినిమా రంగంలో మంచి పేరు తెచ్చుకుంటున్న యువ హీరో ఉదయా నిధి స్టాలిన్ త్వరలో ప్రత్యక్ష రాజకీయాల్లో కి వస్తున్నాడని వార్తలు గుప్పుమన్నాయి. తన తాత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి స్థాపించిన డీఎంకే పార్టీలో రంగ ప్రవేశం చెయ్యాలని ఉదయానిధి స్టాలిన్ నిర్ణయించుకున్నారు.

అంతే కాకుండా ఈ సమయంలో తన తండ్రి స్టాలిన్ కు అండగా ఉండాలని ఉదయానిధి స్టాలిన్ భావిస్తున్నాడని డీఎంకే పార్టీ వర్గాలు అంటున్నాయి. తమిళ సినీ రంగంలో ఉదయానిధి స్టాలిన్ కు మంచి క్రేజ్ ఉంది. అనేక సినిమాలు హిట్ కావడంతో అభిమానుల సంఖ్య పెరిగిపోయింది.

ఇటీవల విడుదలైన మనిధన్ సినిమాతో ప్రేక్షల ముందుకు వచ్చారు. ఆ సినిమా విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఇదే సమయంలో తమిళనాడు శాసన సభ ఎన్నికలు జరగడం, అన్నా డీఎంకే అధికారంలోకి రావడం, డీఎంకే అధికారానికి దూరం కావడంతో ఉదయానిధి స్టాలిన్ రాజకీయాల వైపు ఆసక్తి చూపిస్తున్నారని డీఎంకే నాయకులు అంటున్నారు.

Stalin assures about the Political entry of Udhayanidhi Stalin

చిత్ర పరిశ్రలో ఉంటూ డీఎంకేకి ప్రచారం చేస్తే తనకు ఆ పార్టీ వాదిగా గుర్తింపు పడి సినీ జీవితంపై ప్రభావం చూపిస్తుందని భావించిన ఉదయా నిధి స్టాలిన్ ఇంత కాలం హీరోగా, నిర్మాతగా బాధ్యతలు నిర్వహించారు. అయితే శాసన సభ ఎన్నికల ప్రచారం సందర్బంగా స్టాలిన్ తంజావూరు వెళ్లిన సమయంలో ఆయన వెంట ఉదయానిధి ప్రచారానికి వెళ్లారు.

2016 ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత స్టాలిన్ ఎన్నికల అధికారుల దగ్గర ధ్రువీకరణ పత్రాన్ని అందుకోవడానికి వెళ్లినప్పుడు ఆయన వెంటే వెళ్లారు. తన కుమారుడు, కుమార్తె రాజకీయాల్లోకి రారని, తన రాజకీయ వారసులు ఎవరూ లేరని గతంలో స్టాలిన్ పదే పదే చెప్పారు.

అయితే తాజా పరిణాలు పరిశీలిస్తే ఉదయానిధి స్టాలిన్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారని స్పష్టంగా కనపడుతుందని డీఎంకే వర్గాలు అంటున్నాయి. తన సీని గ్లామర్ తో పార్టీని ముందుకు తీసుకు వెళ్లే సత్తా ఉదయానిధి స్టాలిన్ కు ఉందని ఆ పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు.

English summary
Tamil Nadu : DMK's heir apparent and party treasurer MK Stalin on Sunday said that his son Udhayanidhi Stalin will not be joining politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X