అమరవీరుల త్యాగఫలమే స్వతంత్ర భారతం: ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: 69వ స్వాంతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని నరేంద్రమోడీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. తొలుత రాజ్ ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి నివాళి అర్పించిన ఆయన నేరుగా ఎర్రకోట చేరుకున్నారు. అనంతరం త్రివిద ధళాల అధికారులు మోడీకి గౌరవ వందనం సమర్పించారు.
ఎర్రకోటపై ప్రధాని జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన అమరవీరుల త్యాగఫలమే స్వతంత్ర భారతమని ఆయన వ్యాఖ్యానించారు. భిన్నత్వంలో ఏకత్వమే భారత్ శక్తి అని ఆయన అన్నారు. ఈ విషయంలో భారత్ ప్రపంచ దేశాలకు మార్గదర్శిగా నిలుస్తోందన్నారు.
125 కోట్ల మంది భారతీయులు టీమిండియా స్ఫూర్తితో కృషి చేస్తే దేశం సమున్నత శిఖరాలకు చేరుతుందని ఆయన చెప్పారు. కులతత్వం, మతతత్వం దేశాన్ని పట్టిపీడిస్తున్న సమస్యలని, అభివృద్ధి అన్న కొత్త నినాదంతో వీటన్నింటినీ భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చారు.

ప్రధాని ప్రసంగం క్లుప్తంగా:
* జనవరి 26 నాటికి ప్రతి ఒక్కరికీ ఖాతాలు తెరవాలని బ్యాంకులను ఆదేశించాం.
* బ్యాంకు ఖాతాలు తెరవాలని పిలుపునిస్తే పేదలందరూ ముందుకొచ్చారని, వూహించినదానికి భిన్నంగా రూ. వేల కోట్లు బ్యాంకుల్లో జమ అయ్యాయి.
* ఇది పేదలు సాధించిన విజయం
* ప్రధానమంత్రి జీవన్ జ్యోతి, సురక్షా బీమా యోజన కొత్త మార్గాలు తెరిచాయి.
* తద్వారా బీమా అంటే తెలియని అట్టడుగు వర్గాలకు ధీమా లభించింది
* భారత అభివృద్ధి పిరమిడ్ ఆర్థిక శక్తి మీద ఆధారపడి ఉంటుంది
* దేశవ్యాప్తంగా స్వచ్ఛభారత్ ఉద్యమం వూపందుకుంది.
* గతేడాది ఆగస్టులో జన్‌ధన్ యోజన ప్రారంభించాం.
* 60 ఏళ్లుగా దేశంలో 40 శాతం మందికి బ్యాంకు ఖాతా లేదు
* స్వచ్ఛ భారత్‌కు సెలబ్రిటీలు, నాయకులు... స్వచ్ఛభారత్ అంబాసిడర్లు కాదు, మీ ఇంట్లోని 10-15 ఏళ్ల పిల్లలే స్వచ్ఛభారత్ అంబాసిడర్లు
* గాంధీజీ 150వ జన్మదినం నాటికి స్వచ్ఛభారతాన్ని ఆ మహనీయునికి అంకితం చేయాలి.
* గ్యాస్ రాయితీ తొలగించాలంటే కఠిన నిర్ణయాలు తీసుకోవాలి.
* గ్యాస్ సబ్సిడీని బ్యాంకు ఖాతాలో జమ చేయాలన్న నిర్ణయం గొప్ప ఫలితాన్నిచ్చింది
* ఈ నిర్ణయంతో దళారుల దుకాణాలు మూతపడ్డాయి, ప్రతి ఏటా రూ. 15వేల కోట్లు ఆదా అవుతున్నాయి
* అవినీతి నిర్మూనలో ఇది గొప్ప ముందడుగు.
* ఇప్పటి వరకూ పాలకులంతా పశ్చిమ తీరం అభివృద్ధిపైనే పాలకులంతా దృష్టి సారించారు
* పశ్చిమ తీరం ఒక్కటే అభివృద్ధి చెందితే సరిపోదని, తూర్పు తీరాన్ని అభివృద్ధి చేయాలని చెప్పారు.
* వ్యవసాయ శాఖను రైతు సంక్షేమ శాఖగా మారుస్తాం
* వెనుకబడిన అసోం, బీహార్, ఒడిశా, ఈశాన్య రాష్ట్రాలను అభివృద్ధి దిశగా తీసుకెళతాం.
* దేశంలో ఇప్పటికీ 18,500 గ్రామాల్లో విద్యుత్ లేదని.... రానున్న వెయ్యి రోజుల్లో ఈ 18,500 గ్రామాల్లో కూడా విద్యుత్ వెలుగులు తీసుకొస్తామని హామీ
ఈ కార్యక్రమానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తదితర ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.












Click it and Unblock the Notifications