లాక్ డౌన్..? వార్ రూమ్స్..? ప్రధాని మోదీ ఏం ప్రకటించబోతున్నారు..?
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో ఉత్పాతం ముంచుకొస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. వైరస్ నియంత్రణ కేంద్ర ప్రభుత్వానికి పెను సవాల్‌గా మారింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ.. అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. ఎక్కడో ఏదో తెలియని ఆందోళన నెలకొంది. ఇలాంటి తరుణంలో ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించబోతుండటంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మోదీ ఏం చెప్పబోతున్నారు.. ఏదైనా కీలక ప్రకటన చేయబోతున్నారా.. అని ప్రజలు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
Recommended Video
చిదంబరం ట్వీట్
ఈ నేపథ్యంలో మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం ట్విట్టర్‌లో ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈరోజు(మార్చి 19) రాత్రి 8గంటలకు మోదీ ఏ ప్రకటన చేయబోతున్నారు.. అని ప్రశ్నించిన ఆయన.. ఒకవేళ మోదీ భారత్ లాక్‌డౌన్ ప్రకటించకపోతే.. అది తనను తీవ్ర నిరాశకు గురిచేస్తుందన్నారు. కనీసం నగరాలు,పట్టణాల్లో అయినా రెండు నుంచి నాలుగు వారాల పాటు లాక్ డౌన్ ప్రకటించడం మంచిది అన్నట్టుగా కామెంట్ చేశారు. లేనిపక్షంలో అది దేశాన్ని తీవ్ర నిరాశకు గురిచేస్తుందన్నారు.

లాక్ డౌన్‌కి విజ్ఞప్తి చేసిన స్టార్టప్స్
ఇప్పటికే పలు స్టార్టప్ కంపెనీలు దేశంలోని ప్రధాన నగరాల్లో రెండు నుంచి మూడు వారాలు లాక్ డౌన్ ప్రకటించాల్సిందిగా ప్రధాని కార్యాలయానికి విజ్ఞప్తి చేశాయి. తమ అంచనాల ప్రకారం.. 30 రోజుల తర్వాత కంటే ఇప్పుడు లాక్ డౌన్ ప్రకటించడం ద్వారా ఐదు రెట్లు ఎక్కువమందిని వైరస్ బారి నుంచి కాపాడవచ్చునని గ్రూప్ ఆఫ్ ఫౌండర్స్&ఇన్వెస్టర్స్ గ్రూప్ తమ పిటిషన్‌లో పేర్కొంది.

వార్ రూమ్స్ ఏర్పాటు చేయాలని సూచన..
అర్బన్ కంపెనీ,బౌన్స్,ఉద్యం లెర్నింగ్ ఫౌండేషన్,క్రెడ్,స్నాప్ డీల్,మై గేట్,వోకల్,అనకాడమీ,1ఎంజీ,మ్యాట్రిక్స్ పార్ట్‌నర్స్,యాక్సెల్ పార్ట్‌నర్స్,కలారీ కేపిటల్ సహా తదితర సంస్థలు లాక్ డౌన్ కోసం విజ్ఞప్తి చేశాయి. సౌత్ కొరియా,జపాన్,సింగపూర్ వంటి దేశాలు వైరస్ బయటపడ్డ వెంటనే తక్షణ చర్యలు తీసుకోవడంతో వైరస్‌ను నియంత్రించగలిగారని ఆ సంస్థలు తమ పిటిషన్‌లో పేర్కొన్నాయి. ప్రజలకు అవసరమైన నిత్యావసర వస్తువులు,ఆహార పదార్థాలు అందుబాటులో ఉంచి.. లాక్ డౌన్ ప్రకటించాల్సిందిగా ఆయా సంస్థలు కోరుతున్నాయి. వైరస్ నియంత్రణ కోసం ప్రతీ రాష్ట్రంలో ముఖ్యమంత్రుల నేత్రుత్వంలో వార్ రూమ్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాయి.












Click it and Unblock the Notifications