SBI: రూ.2000 నోట్లు మార్పిడిపై ఎస్బీఐ కీలక ప్రకటన.. ఆ పత్రాలు అవసరం లేదని స్పష్టం..
రూ.2000 నోట్లు ఉపసంహరించుకోవాలని ఆర్బీఐ శుక్రవారం కీలక ప్రకటన చేసింది. నోట్లను సెప్టెంబర్ 30,2023 లోపు మార్చుకోవాలని ప్రజలకు సూచించింది. కొత్తగా 2 వేల నోట్ల ముద్రణ, పంపిణీ ఉండదని.. మార్కెట్‌లో ఉన్న నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవాలంటూ స్పష్టం చేసింది. మే 23 నుంచి ఆర్‌బీఐ రీజనల్ ఆఫీసుల్లో 2 వేల నోట్లను మార్చుకోవచ్చని ఆర్బీఐ తెలిపింది. రూ.2000 డినామినేషన్ నోట్లలో దాదాపు 89% మార్చి 2017కి ముందు జారీ చేశారు.
అయితే రూ. 2000 నోట్ల మార్పిడి పై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన విడుదల చేసింది. 2000 రూపాయల నోట్ల మార్పిడికి ప్రజలు ఎవరూ కూడా ఐడెంటిటీ ప్రూఫ్ చూపించాల్సిన పని లేదని స్పష్టం చేసింది. అంతేకాదు రిక్వెస్ట్ ఫామ్ నింపాల్సిన పనిలేదని పేర్కొంది. అర్బీఐ వెల్లడించిన రూల్స్ ప్రకారం ఒకే విడతలో గరిష్టంగా రూ. 20 వేల వరకు నోట్లను మార్చుకోవచ్చునని ప్రకటనలో వివరించింది. బ్యాంకుల్లో నోట్ల మార్పిడి చేసుకోవాలంటే ఖాతాదారులు ఆధార్ కార్డ్ వంటి గుర్తింపు పత్రాలతో పాటుగా ఒక ఫారమ్‌ను సమర్పించాలని సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

దీనిపై క్లారిటీ ఇస్తూ ఎస్బీఐ ఒక ప్రకటన విడదల చేసింది. సో మీ దగ్గర రూ.2000 నోట్లు ఉంటే వెంటనే వెళ్లి మార్చుకోవచ్చు. రూ.1,000, పాత రూ.500 నోట్ల రద్దు తర్వాత రూ.2,000 డినామినేషన్ కరెన్సీ నోటును నవంబర్ 2016లో ప్రవేశపెట్టారు. ఆర్‌బిఐ ప్రకారం, ఇతర డినామినేషన్లలో కరెన్సీ తగిన పరిమాణంలో అందుబాటులోకి వచ్చిన తర్వాత రూ.2,000 నోట్లను ప్రవేశపెట్టే లక్ష్యం నెరవేరింది. అలాగే, 2018-19లో రూ.2,000 నోట్ల ముద్రణను ఇప్పటికే నిలిపివేశారు. ఫ్రస్తుతం చెలామణిలో ఉన్న రూ. 2వేల నోట్లను.. క్లీన్ నోట్ పాలసీలో భాగంగా ఉపసంహరించుకుంది.
మరోవైపు షాపింగ్ మాల్, వైన్స్, రెస్టారెంట్లు, బెకరీలకు ప్రజలు రూ.2000 నోట్లను తీసుకురావడం పెరిగింది. అయితే కొన్ని షాపుల్లో రూ.2000 తీసుకంటున్నారు. మరికొన్ని షాపుల్లో మాత్రం రూ.2000 నోట్లు తీసుకోవడం లేదని బోర్డులు కూడా పెట్టారు. రూ.2000 ఉపసంహరణ తర్వాత పెద్ద నోటుగా రూ.500 నోటు ఉండబోతుంది.












Click it and Unblock the Notifications