మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి..
రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన ఎక్సైజ్ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి ప్రకటించిన ఆల్కహాల్ ఇన్ బెవరేజ్ ఎక్సైజ్ మోడల్ ప్రకారం ఏప్రిల్ నుండి మద్యం ధరలు తగ్గే అవకాశం ఖాయంగా కనిపిస్తోంది. మద్యంపై పన్ను విధానంలో భారీ మార్పులు చేర్పులు చేయడమే దీనికి ప్రధాన కారణం. మద్యం మొత్తం పరిమాణం కాకుండా అందులో ఉండే ఆల్కహాల్ శాతం ఆధారంగా పన్నును విధించబోతోంది ప్రభుత్వం.
కర్ణాటకలో దశాబ్దాల నాటి ఎక్సైజ్ విధానాన్ని ఆధునీకరించడం, అంతర్జాతీయ పన్నుల పద్ధతులకు అనుగుణంగా మార్చడం ఈ సంస్కరణల ప్రధాన లక్ష్యం. ప్రతిపాదిత విధానం ప్రకారం ఇకపై ఎక్సైజ్ పన్ను ఒక లీటరు ఆల్కహాల్ కంటెంట్ ఆధారంగా లెక్కిస్తారు. అంతకుముందు లీటరు లిక్కర్ చొప్పున అల్కహాల్ స్థాయిని పరిగణనలోకి తీసుకునేవారు. తాజాగా ప్రకటించిన ఆల్కహాల్ ఇన్ బెవరేజ్ ఎక్సైజ్ మోడల్ ప్రకారం అల్కహాల్ కంటెంట్ ఆధారంగా పన్ను మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.

అసెంబ్లీకి సమర్పించిన బడ్జెట్ ప్రతిపాదనల్లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దీన్ని పొందుపరిచారు. మద్యం పన్ను, ధరల నియంత్రణలో సంస్కరణలను ప్రకటించారు. ఇందులో కొత్త ఆల్కహాల్ ఆధారిత పన్ను విధానం, ధరల నియంత్రణ ఎత్తివేత, సాంకేతికతతో కూడిన నిఘా వ్యవస్థలు ఉన్నాయి. పన్ను విధానాన్ని సరళీకృతం చేయడానికి ఆల్కహాల్ ధరల శ్లాబుల సంఖ్య గణనీయంగా తగ్గిస్తోన్నామని, ప్రస్తుతం ఉన్న 16 శ్లాబుల నుండి ధరల శ్లాబులు హేతుబద్ధీకరించి ఎనిమిది శ్లాబులకు తగ్గించామని సిద్ధరామయ్య అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా మద్యం తరలింపులో లీకేజీలను అరికట్టడానికి, పర్యవేక్షణను మెరుగుపరచడానికి ప్రభుత్వం సాంకేతిక వ్యవస్థలను ప్రవేశపెడుతోంది. ఎస్కార్ట్‌ల స్థానంలో జియో-ఫెన్స్డ్ ఈ-లాక్ వ్యవస్థ అమలులోకి వస్తుంది. ఈ చర్య పారదర్శకత, రియల్ టైమ్ పర్యవేక్షణను పెంచుతాయని సిద్ధరామయ్య తెలిపారు.
ఉత్పత్తి లైసెన్స్‌లు ఆటో-రిన్యూవల్ అవుతాయని, లేబుల్ అనుమతులు, తాత్కాలిక లైసెన్స్‌లు,ఆర్వీబీ లైసెన్స్‌లు ఆన్‌లైన్ సెల్ఫ్-డిక్లరేషన్, ఫీజు చెల్లింపుల్లో మానవ ప్రమేయం ఉండదని తెలిపారు. ప్రస్తుతం రిటైల్ మద్యం ధరలను నేరుగా కర్ణాటక ప్రభుత్వమే నిర్ధారిస్తోంది. ఈ పాత్ర నుండి తప్పుకోవాలని కూడా ప్రభుత్వం యోచిస్తోంది. తన జోక్యానికి బదులుగా డిమాండ్‌ను బట్టి మద్యం తయారీ సంస్థలు ధరల శ్లాబులలో తమ ఉత్పత్తులను ఎలా ఉంచాలో నిర్ణయిస్తారు.
కాగా- ఎక్సైజ్ శాఖకు 2026-27 ఆర్థిక సంవత్సరానికి 45,000 కోట్ల ఆదాయాన్ని నిర్దేశించారు. డిస్టిలరీలు, బ్రూవరీలను 24 గంటలు పనిచేయడానికి అనుమతిస్తామని ఆయన ప్రకటించారు. బీర్ లేబుళ్లపై మాల్ట్, షుగర్ కంటెంట్‌ను తప్పనిసరిగా ప్రదర్శించాలనే నిబంధనను కూడా తొలగిస్తారని సిద్ధరామయ్య చెప్పారు.
ఈ సంస్కరణలను బ్రూయర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాతో సహా పలు పరిశ్రమ సంఘాలు స్వాగతించాయి. ఇది మద్యం పన్నుల విధానంలో ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్న ఉత్తమ విధానమని అభిప్రాయపడ్డాయి. అసోసియేషన్ డైరెక్టర్ జనరల్ వినోద్ గిరి మాట్లాడారు. ఆల్కహాల్ కంటెంట్‌పై పన్ను విధించే విధానాన్ని స్వాగతిస్తోన్నామని చెప్పారు. ఈ విధానం అమలులోకి వస్తే బీరు, వైన్ ధరలు తగ్గే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డారు.
-
Viral Video: అందరిముందు I LOVE U చెప్పిన ప్రొఫెసర్.. చెప్పుతో కొట్టిన విద్యార్థిని -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్












Click it and Unblock the Notifications