జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హోదా- కేంద్రం కోర్టులో బంతి
Jammu Kashmir: కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్‌కు మరోసారి రాష్ట్ర హోదా దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సారథ్యంలో కొత్తగా కొలువుదీరిన నేషనల్ కాన్ఫరెన్స్ సంకీర్ణ కూటమి ప్రభుత్వం రూపొందించిన తీర్మానానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. జమ్మూ కాశ్మీర్ లెప్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా దీన్ని యధాతథంగా ఆమోదించారు.
దీనితో జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించాల్సిన అంశం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చినట్టయింది. దీనిపై- ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమౌతోంది.

నిజానికి- జమ్మూ కాశ్మీర్‌కు గతంలో ఉన్న రాష్ట్ర హోదాను తొలగించింది ఎన్డీఏ ప్రభుత్వమే. స్వయం ప్రతిపత్తి గల రాష్ట్రంగా గుర్తించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని 2019 ఆగస్టులో రద్దు చేసింది కేంద్రం. ఆ రాష్ట్రాన్ని విభజించింది. జమ్మూ కాశ్మీర్, లఢక్ కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించింది. దీనికి సంబంధించిన బిల్లును అప్పట్లో పార్లమెంట్ ఉభయసభలు ఆమోదించాయి.
ఇప్పుడు మళ్లీ ఈ డిమాండ్ తెర మీదికి వచ్చింది. తాము అధికారంలోకి వస్తే జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామంటూ నేషనల్ కాన్ఫరెన్స్, దాని మిత్రపక్షం కాంగ్రెస్ ప్రకటించిన విషయం తెలిసిందే. అటు బీజేపీ సైతం దీనిపై సానుకూలంగానే వ్యవహరించింది ఎన్నికల ప్రచార సమయంలో.
దీనికి అనుగుణంగానే ప్రభుత్వం ఏర్పాటైన తరువాత తొలి మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తీర్మానం చేశారు. ఆమోదం కోసం లెప్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాకు పంపించారు. ఈ తీర్మానాన్ని మనోజ్ సిన్హా యధాతథంగా ఆమోదించారు. ఇందులో ఎలాంటి అనుమానాలను కూడా లేవనెత్తలేదు.
అలాగే- నవంబర్ 4వ తేదీన అసెంబ్లీని సమావేశ పర్చాలనీ నిర్ణయించారు. రాష్ట్ర హోదా తీర్మానాన్ని అటు అసెంబ్లీ కూడా ఏకగ్రీవంగా ఆమోదించడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీకి కొన్ని అభ్యంతరాలు ఉన్నప్పటికీ- రాష్ట్ర హోదా విషయంలో దాన్ని బయటపెట్టకపోవచ్చని తెలుస్తోంది.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications