వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్టీవెన్ స్మిత్: ఒక బాల్‌కి 16 పరుగులు, ఇది ఎలా సాధ్యమైంది?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
స్టీవెన్ స్మిత్

ఆస్ట్రేలియాలో జరిగిన బిగ్ బాష్ టోర్నమెంట్‌లో ఒక అనూహ్యమైన రికార్డును నమోదు చేశాడు స్టీవెన్ స్మిత్.

సిడ్ని సిక్సర్స్ కోసం ఆడిన స్మిత్, ఒకే బాల్‌కి 16 పరుగులతో మైదానాన్ని ఉర్రూతలూగించాడు.

ఇది నమ్మడం కష్టమే కానీ, జరిగింది. ఆస్ట్రేలియాలోని హోబర్ట్‌‌లో జరిగిన మ్యాచ్‌లో ఈ అరుదైన రికార్డు నెలకొల్పాడు స్మిత్.

హోబర్ట్ హరికేన్స్ బౌలర్ జోయెల్ పారిస్ వేసిన బాల్‌కి స్మిత్ ఈ రికార్డును సృష్టించాడు.

మ్యాచ్‌లో రెండో ఓవర్‌లో బౌలింగ్ వేసేందుకు పారిస్ వచ్చాడు. స్మిత్ బ్యాటింగ్ చేస్తున్నాడు. తొలి రెండు బాల్స్‌కి ఎలాంటి పరుగులు తీయలేదు స్మిత్.

పారిస్ వేసిన మూడో బాల్‌కి స్మిత్ సిక్స్ కొట్టాడు. స్క్వేర్ లెగ్‌తో పారిస్ వేసిన బాల్‌ను స్మిత్ బౌండరీ దాటించాడు. అయితే, పారిస్ క్రీజును దాటడంతో అంపైర్ నోబాల్ ప్రకటించాడు.

దీంతో ఏడు పరుగులు వచ్చాయి.

ఫ్రీ హిట్‌ కోసం వేయాల్సిన బంతిని పారిస్ విసరగా అది వైడ్ కావడంతోపాటు కీపర్ చేతికి చిక్కుండా బౌండరీకి వెళ్లిపోయింది.

బౌండరీకి, వైడ్‌కు కలిపి 5 పరుగుల అయ్యాయి. దీంతో మొత్తంగా స్మిత్‌ 12 పరుగులు చేసినట్టయింది. ఫ్రీ హిట్ కోసం విసరాల్సిన బంతి మిగిలే ఉంది.

పారిస్ విసిరిన ఆ బంతిని స్మిత్ బౌండరీకి పంపాడు. దీంతో ఒక్కబాల్ కు 16 పరుగులు చేసినట్లయింది. క్రికెట్‌లో ఇదొక రికార్డుగా నమోదైంది.

https://twitter.com/BBL/status/1617439537416003585?s=20&t=INmrIiM1kyJhG4TfNPdRag

ఈ మ్యాచ్‌లో స్మిత్ 33 బంతుల్లో 66 పరుగులు చేశాడు. వీటిలో నాలుగు ఫోర్‌లు, ఆరు సిక్స్‌లున్నాయి. అతని టీమ్‌ 20 ఓవర్లలో 180 పరుగులను చేసింది.

ఈ స్కోర్‌ను ఛేదించేందుకు ప్రయత్నించిన హోాబర్ట్ హరికేన్స్ జట్టు 156 పరుగులు మాత్రమే చేయగలిగింది.

ఆశ్చర్యకరంగా ఈ టీ20 క్రికెట్‌లో స్టీవెన్ స్మిత్‌ను బ్యాట్స్‌మన్‌లాగా గుర్తించలేదు. కానీ ఇటీవల కాలంలో స్టీవెన్ స్మిత్ అద్భుతంగా ఆడుతున్నాడు.

గత మ్యాచ్‌లో కూడా సిడ్ని థండర్స్‌పైన శతకంతో చెలరేగిపోయాడు. అంతకుముందు మ్యాచ్‌లో కూడా అడిలైడ్ స్ట్రైకర్స్‌పై కూడా సెంచరీ చేశాడు.

రెండు శతకాల తర్వాత, 66 పరుగులతో మరో సూపర్ ఇన్నింగ్స్‌ను నమోదు చేశాడు స్మిత్.

జోయెల్ పారిస్

మరోపక్క ఒక్క బాల్‌కి 16 పరుగులు ఇచ్చిన జోయెల్ పారిస్ 3 ఓవర్లలో 32 పరుగులకు ఒక వికెట్ తీశాడు.

30 ఏళ్ల జోయెల్ ఆస్ట్రేలియా తరఫున రెండు వన్డేలను ఆడాడు. ఈ రెండు వన్డేలు భారత్‌తో ఆడినవే. అతని బౌలింగ్‌కి తొలి వికెట్‌గా శిఖర్ ధావన్ ఔటయ్యాడు.

2016 సీజన్ ఐపీఎల్‌లో దిల్లీ డేర్‌డెవిల్స్ టీమ్‌లో పారిస్‌ సభ్యుడు. కానీ, గాయాల కారణంగా ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేకపోయాడు.

జస్‌ప్రీత్ బుమ్రా

ఒకే ఓవర్లో 35 పరుగులు

స్వింగ్, సీమ్ బౌలింగ్‌తో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న జస్‌ప్రీత్ బుమ్రా కూడా గతేడాది ఓకే ఓవర్‌లో 35 పరుగులు చేసి ప్రపంచ రికార్డును సాధించిన సంగతి తెలిసిందే.

టెస్ట్ క్రికెట్‌లో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా బుమ్రా రికార్డు ఇప్పటికీ ఉంది.

ఇందులో నాలుగు ఫోర్లు, ఒక సిక్స్, ఒక సింగిల్‌తోపాటు ఒక వైడ్, ఒక నోబాల్‌లను కూడా ఫోర్లుగా మలచడంతో బుమ్రా ఒకే ఓవర్‌లో 35 పరుగులు సాధించినట్లయింది.

https://twitter.com/mufaddal_vohra/status/1543184427529826305

గత ఏడాది జులైలో ఇంగ్లండ్ తో జరిగిన అయిదో టెస్టులో బుమ్రా చేసిన ఫీట్‌ను, అప్పటికి పదిహేనేళ్ల కిందట యువరాజ్ సింగ్ ఒకే ఓవర్ లో ఆరు సిక్సులతో పోల్చారు.

తొలి టి20 ప్రపంచకప్ సందర్భంగా 2007 సెప్టెంబర్ 19న ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో యువరాజ్ సింగ్, బ్రాడ్ బౌలింగ్‌లో ఒకే ఓవర్‌లో వరుసగా ఆరు సిక్సర్లు బాదాడు.

ఆ మ్యాచ్‌లో 16 బంతుల్లోనే యువరాజ్ 58 పరుగులు సాధించాడు. ఇందులో 4 ఫోర్లు, 7 సిక్స్‌లు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Steven Smith: 16 runs a ball, how is this possible?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X