వందే భారత్ రైలు మీద రాళ్లదాడి, ఆంధ్రా బార్డర్ లో తంబీలు ?, ఎవరు టార్గెట్?

చెన్నై/చిత్తూరు/మైసూరు: వందే భారత్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్నారు. వందే భారత్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా జెండా ఊపి వందే భారత్ రైళ్లను ప్రారంభిస్తున్నారు. ఈ విషయం గమనిస్తే వందే భారత్ రైళ్ల మీద ప్రధాని నరేంద్ర మోదీకి ఎంత ప్రేమ ఉందో తెలుస్తోంది. వందే భారత్ రైలు మీద కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల వర్షం కురిపించడం కలకలం రేపింది.

ఇటీవల కేరళలోని మల్లప్పురం జిల్లాలోని తిరునావయ రైల్వేస్టేషన్ సమీపంలో తిరువనంతపురం-కాసరగూడు మధ్య సంచరించే వందే భారత్ రైలు మీద రాళ్ల కొందరు రాళ్ల వర్షం కురిపించారు. గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి చెయ్యడంతో వందే భారత్ రైలు కిటికీల గాజులు పూర్తిగా పగిపోయి సీ4 కోచ్ 62, కోచ్ 63 కిటికీల అద్దాలు పగిలిపోయాయాయి. ఈ కేసులో ఇంకా ఎవ్వరూ పోలీసులకు చిక్కలేదు.

Stone pelting on Mysuru-Chennai Vande Bharat train, attack at Katpadi near Andhra border

ఆదివారం మైసూరు నుంచి చెన్నైకి వందే భారత్ రైలు బయలుదేరింది. మార్గం మధ్యలో తమిళనాడు- ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని కాట్ పాడి (తమిళనాడు)లోకి సాయంత్రం ఎంట్రీ ఇచ్చింది. ఆ సమయంలో మహేంద్రవాడి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు వందే భారత్ రైలు మీద రాళ్ల వర్షం కురిపించారు. హడలిపోయిన ప్రయాణికులు వెంటనే రైల్వే సిబ్బందికి సమాచారం ఇచ్చారు.

ఈ రాళ్ల దాడిలో మైసూరు-చెన్నై మార్గంలో సంచరించే వందే భారత్ రైలులోని C6 కాంపార్ట్ మెంట్ లోని 75, 76 బోగీల గాజులు పూర్తిగా దెబ్బ తిన్నాయని, ప్రయాణికులు ఎవ్వరికి ఎలాంటి హాని జరగలేదని రైల్వే అధికారులు తెలిపారు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు (ఆర్ పీఎఫ్) రంగంలోకి దిగి విచారణ ముమ్మరం చేశారు. అయితే ఈ కేసులో ఇంత వరకు ఎవ్వరిని అరెస్టు చెయ్యలేదని పోలీసులు అన్నారు.

కాట్ పాడి, మహేంద్రవాడి పోలీసులు పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు. అన్ని వివరాలు సేకరించిన రైల్వే పోలీసులు వందే భారత్ రైలుకు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని నిర్ణయించారని రైల్వే శాఖ అధికారులు తెలిపారు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే వందే భారత్ రైలును టార్గెట్ చేసుకున్న వాళ్లు రాళ్ల దాడులు చేస్తున్నానరు.

గతంలో పలు రాష్ట్రాల్లో వందే భారత్ రైళ్ల మీద రాళ్ల దాడులు జరిగాయి. బెంగళూరులోని కేఆర్ పురం రైల్వే స్టేషన్ కు సమీపంలో వేగంగా వెలుతున్న వందే భారత్ రైలు మీద కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడులు చేశారు. రైళ్ల మీద రాళ్ల దాడి జరిగితే సీరియస్ గా తీసుకునే రైల్వే పోలీసులు వందే భారత్ రైళ్ల మీద జరుగుతున్న దాడులను ఇంకా సీరియస్ గా తీసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు. వందే భారత్ రైళ్లనే కొందరు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనే విషయం అంతుచిక్కడం లేదని రైల్వే పోలీసులు అంటున్నారు. అయితే వందే భారత్ రైళ్ల మీద దాడులు చేసిన వాళ్లు మాత్రం చిక్కితే వాళ్లకు సినిమా చూపించాలని రైల్వే పోలీసులు వేచి చూస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+