వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంతకుమించి మరేం లేదు: ప్రెస్ మీట్‌పై తేల్చేసిన సుప్రీం జడ్జీ కురియన్

|
Google Oneindia TeluguNews

కొచ్చి: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై శుక్రవారం మీడియా సమావేశంలో విమర్శలు గుప్పించిన నలుగురు న్యాయమూర్తుల్లో ఒకరైన జస్టిస్ కురియన్ జోసెఫ్ శనివారం మీడియాతో మాట్లాడారు. న్యాయం, న్యాయ వ్యవస్థ కోసమే తాను ఇలా మీడియా ముందుకు వచ్చామని చెప్పారు.

ప్రెస్ మీట్ ఎఫెక్ట్: రంజన్ గగోయ్‌ తదుపరి సీజేఐ కాలేరా?ప్రెస్ మీట్ ఎఫెక్ట్: రంజన్ గగోయ్‌ తదుపరి సీజేఐ కాలేరా?

సమస్య త్వరలోనే సమసిపోతుందని తాము భావిస్తున్నట్లు జస్టిస్ కురియన్ తెలిపారు. న్యాయ వ్యవస్థను కాపాడేందుకు తాము మీడియా ముందుకు రావాలనే అనూహ్య నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

Stood up for justice, judiciary, nothing else: Judge Kurian Joseph

ఏదో జరుగుతోంది: సుప్రీం జడ్జీల ప్రెస్‌మీట్‌పై అన్నా హజారేఏదో జరుగుతోంది: సుప్రీం జడ్జీల ప్రెస్‌మీట్‌పై అన్నా హజారే

అంతకుమించి మరేం లేదని తెలిపారు. తాము చేసిన దాంట్లో ఎలాంటి తప్పు లేదని కురియన్ స్పష్టం చేశారు. సుప్రీంకోర్టులో మరింత పారదర్శకత పెరగాలనేదే తమ ఆకాంక్ష అని చెప్పారు.

కొచ్చి సమీపంలోని కలడిలోని తన నివాసానికి వచ్చిన సందర్భంగా స్థానిక మీడియా ఛానళ్లతో ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. సమస్య ఏదైనా తెరపైకి వస్తేనే ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అన్నారు. ప్రజలకు న్యాయవ్యవస్థపై మరింత నమ్మకం కలిగించాలని అన్నారు.

English summary
Justice Kurian Joseph, one of the four senior Supreme Court judges who virtually revolted against the country's chief justice over "selective" case allocation and certain judicial orders, on Saturday expressed confidence that the issues raised by them would be resolved.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X