• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

#StoryForGlory: విజేతలుగా 12 మంది స్టోరీ టెల్లర్స్‌.. ఎంపిక చేసిన డైలీహంట్-అదానీ సంస్థలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత్‌లో డిజిటల్ కంటెంట్ వేగంగా విస్తరిస్తోంది. ప్రజలు కూడా ఈ డిజిటల్ కంటెంట్‌ను ఎంతో ఇష్టపడుతున్నారు. ఇందుకు నిదర్శనం డిజిటల్ కంటెంట్ అత్యంత ప్రజాదరణ పొందడమే. ప్రముఖ న్యూస్ అగ్రిగేటర్ డైలీహంట్ ఓ ప్రత్యేకమైన టాలెంట్ హంట్‌ను నిర్వహించి దేశవ్యాప్తంగా 12 మంది స్టోరీ టెల్లర్స్‌‌ను గుర్తించింది. ఇందుకోసం ఓ #StoryForGlory పేరుతో ఓ సక్సెస్‌ఫుల్ క్యాంపెయిన్‌ను నిర్వహించింది.ఏఎంజీ మీడియా నెట్ వర్క్స్,అదానీ గ్రూప్‌తో సంయుక్తంగా డైలీహంట్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్టోరీ టెల్లర్స్‌కు ఒక మంచి అవకాశం కలిపించింది. దేశవ్యాప్తంగా జరిగిన టాలెంట్ హంట్‌లో వీడియో మరియు ప్రింట్ కేటగిరీలో మొత్తం 12 మంది విజేతలను గుర్తించడం జరిగింది.

ఈ ఏడాది మే నెలలో ప్రారంభమైన ఈ టాలెంట్ హంట్‌లో 1000 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. ఫైనల్స్‌కు మొత్తం 20మందిని ఎంపిక చేయడం జరిగింది. ఈ ప్రత్యేక క్యాంపెయిన్ ద్వారా పోటీదారులు జర్నలిజంలో తమ కెరీర్‌ను నిర్మించుకునే మంచి అవకాశం కల్పించారు.కరెంట్ అఫైర్స్, న్యూస్, సైన్స్, టెక్నాలజీ, ఆర్ట్, కల్చర్ మొదలైన రంగాలలో గొప్ప కంటెంట్‌ను సృష్టించి తమలోని టాలెంట్‌ను వెలికితీయడమే ఈ పోటీ యొక్క ప్రధాన లక్ష్యం.

ఎంపిక చేసిన 20మంది పోటీదారులు 8 వారాల పాటు ఫెలోషిప్ ప్రోగ్రామ్, రెండు వారాల పాటు లెర్నింగ్ ప్రోగ్రామ్‌ ప్రతిష్టాత్మక మీడియా ఇన్స్‌టిట్యూట్ MICAలో చేయడం జరిగింది.ఇక్కడ శిక్షణ పొందిన తర్వాత ఆరువారాల పాటు ఫైనల్ ప్రాజెక్టుపై పనిచేశారు. ప్రముఖ మీడియా పబ్లిషింగ్ సంస్థల పర్యవేక్షణలో వీరంతా పనిచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా విజేతలంతా వారి నైపుణ్యతను మరింత మెరుగుపర్చుకోవడమే కాకుండా స్టోరీ కంటెంట్‌ను కూడా మరింత డెవలప్ చేసుకునేలా తర్ఫీదు పొందారు.

#StoryForGlory:Dailyhunt and Adani groups successful campaign picks 12 storytellers as winners

చివరిగా జ్యూరీ 12 మందిని విజేతగా ఎంపిక చేసింది. ఈ జ్యూరీలో డైలీ హంట్ వ్యవస్థాపకులు వీరేంద్ర గుప్త, ఏఎంజీ మీడియా నెట్ వర్క్స్ సీఈఓ మరియు ఎడిటర్ ఇన్ ఛీఫ్ సంజయ్ పుగాలియా, ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ గోయెంకా,ఫిలిం కంపానియన్ వ్యవస్థాపకులు అనుపమ చోప్రా, షీ ద పీపుల్ వ్యవస్థాపకులు శైలీ చోప్రా గావ్ కనెక్షన్ వ్యవస్థాపకులు నీలేష్ మిశ్రా, ఫ్యాక్టర్ డైలీ సహవ్యవస్థాపకులు పంకజ్ మిశ్రాలు సభ్యులుగా వ్యవహరించారు.

మీడియా వ్యవస్థను బలోపేతం చేసి ప్రతిభావంతులను తమ ప్రతిభను ప్రదర్శించేందుకు డైలీ హంట్ మంచి వేదికను కల్పిస్తోందని ఈ సంస్థ వ్యవస్థాపకులు వీరేంద్ర గుప్తా చెప్పారు. డైలీహంట్‌ సాంకేతికత పరంగా బలోపేతంగా ఉందని గుర్తు చేసిన వీరేంద్ర గుప్తా... ఈ టెక్నాలజీ ద్వారా ఉత్తమ స్టోరీ టెల్లర్స్‌ను గుర్తించొచ్చని వెల్లడించారు.

సుసంపన్నమైన మరియు వైవిధ్యమైన కథలకు భారత్ పుట్టినిల్లు.భారత్‌లో చాలామంది స్టోరీ టెల్లర్స్ ఉన్నారు. ఈ వేదిక ద్వారా తరువాతి తరం స్టోరీ టెల్లర్స్‌ను డైలీహంట్‌తో కలిసి గుర్తించగలిగామని ఏఎంజీ మీడియా నెట్‌వర్క్స్ లిమిటెడ్ సీఈఓ సంజయ్ పుగ్లియా చెప్పుకొచ్చారు. అదే సమయంలో వారి సామర్థ్యాలను మెరుగుపరుచుకునే అవకాశాన్ని కూడా కల్పించాము. తాము ప్రారంభించిన #StoryforGlory క్యాంపెయిన్‌కు మంచి స్పందన వచ్చింది. అదే సమయంలో మంచి కంటెంట్‌ను అందించేందుకు కొత్త మార్గాలు అణ్వేషనకు ఉపయోగపడుతుందని సంజయ్ చెప్పారు.

English summary
After a rigourous training and selection process that lasted weeks, India's leading local language content platform Dailyhunt has finally discovered 12 new promising storytellers in India with its highly-successful initiative #StoryForGlory.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X