Dog Attack: ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం.. అప్పుడే పుట్టిన శిశువును కరిచి చంపిన కుక్క..!

వీధి కుక్కల దాడులు ఆగడం లేదు. నిత్యం ఏదో ఒక చోట ప్రజలపై దాడులు చూస్తూనే ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ అంబర్ పేటలో ఓ బాలుడిని కుక్కలు దాడి చేసి చంపాయి. ఆ తర్వాత ఖమ్మం జిల్లాలో కూడా ఓ బాలుడి పై కుక్కలు దాడి చేశాయి. తాజాగా అప్పుడే పుట్టిన శిశువును కరిచి చంపిన ఘటన దేశంలో సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటన కర్ణాటక శివమొగ్గ జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రి ప్రసూతి వార్డులో జరిగింది.

సోమవారం ఉదయం 7 గంటలకు ఓ వీధి కుక్క అప్పుడే పుట్టిన శిశువును నోట కరుచుకుని తీసుకెళ్తోంది. కుక్క శిశువతో ప్రసూతి వార్డు చుట్టూ తిరగడాన్ని చూసిన సెక్యూరిటి సిబ్బంది వెంటనే కుక్కను తమిరికొట్టారు. శిశువును ఆస్పత్రిలోపలికి తీసుకెళ్లారు. కానీ శిశువు అప్పటికే మృతి చెందినట్లు తెలిసింది. ఈ ఘటన ఆస్పత్రిలో కలకలం సృష్టించింది. అయితే చనిపోయిన శిశువునే కుక్క నోట కరుచుకుని వెళ్లిందా.. లేక కుక్కనే చంపిందా అనేది విచారణ చేస్తున్నారు.

Street Dog Attacks on new born baby in karnataka

ఈ ఘటనపై పోలీసులు వెంటనే కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించారు. శిశువును పోస్టుమార్టంకు తరలించారు. పోస్టుమార్టం తర్వాతే శిశువు మృతికి గల కారణాలు తెలిసే అవకాశం ఉంది. అయితే శిశువుకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది. శిశువు తల్లిదండ్రులు ఎవరు అనేది కూడా తెలియరాలేదు. పోలీసులు అన్ని ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రులలో గర్భిణుల రికార్డులను పరిశీలిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+