ప్రొడ్యూసర్ కూతురుని ట్రాప్ చేసిన జూ.నటుడు అరెస్ట్

Posted By:
Subscribe to Oneindia Telugu

ముంబై: ప్రముఖ ప్రొడ్యూసర్ కూతురును ట్రాప్ చేసిన కేసులో ఉత్తర ప్రదేశ్‌కు చెందిన గుడ్డు అన్సారీని (28) ముంబై పోలీసులు అరెస్టు చేశారు. తన జీవితంలోని ఆశలను నెరవేర్చుకోవడం కోసం బాలీవుడ్‌కు చెందిన ఓ బడా ప్రొడ్యూసర్ కూతురుకు అతను వల వేశాడు.

కానీ అతని ప్లాన్ బెడిసికొట్టి ఊచలు లెక్కబెడుతున్నాడు. ఆమె తండ్రి నిర్మిస్తున్న సినిమాకు సంబంధించిన ఆడిషన్స్‌కు వెళ్లిన ఆమెను అన్సారీ ట్రాప్ చేశాడు. ఆమెతో పరిచయం పెంచుకుని ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. కొన్నాళ్లు సజావుగానే సాగిన వీరి ప్రేమ వ్యవహారంలో అశాంతి రేగింది.

Struggling Actor and the Stalker of Film Producer’s Daughter Arrested!

రహస్యంగా పెళ్లి చేసుకుందామని ఆమెను బలవంతం చేశాడు. తన తండ్రికి చెప్పి చేసుకుందామని ఆమె చెప్పింది. అతను ససేమీరా అనడంతో, ఆమె అతనికి కొద్ది రోజులుగా దూరంగా ఉంటోంది. అప్పటి నుంచి సైకోగా మారి అన్సారీ వేధింపులకు పాల్పడ్డాడు.

ఆమె మొబైల్‌కు బెదిరింపు మెసేజ్‌లు, అసభ్యకర ఫోటోలు పంపించేవాడు. ఈ విషయాన్ని యువతి తండ్రితో చెప్పింది. పోలీసులు విచారణ చేసి అతనిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో అన్సారీ చెప్పిన సమాచారం మేరకు.. అతను ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్న నటుడు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Struggling Actor and the Stalker of Film Producer’s Daughter Arrested!

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి