Student: విద్యార్థిని మీద రేప్ చేసిన టీచర్, బ్రోకర్ అవతారమెత్తిన మరో టీచర్, గర్బవతి కావడంతో !
జోధ్ పూర్/జైపూర్/ చెన్నై: స్కూల్ లో తమ కుమార్తె బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేస్తే మేము సుఖంగా ఉండవచ్చని తల్లిదండ్రులు బావించారు. స్కూల్ కు వెలుతున్న విద్యార్థిని మీద అదే స్కూల్ టీచర్ కన్ను పడింది. స్కూల్ లో తరగతులు పూర్తి అయిన తరువాత విద్యార్థులు ఎవరి ఇళ్లకు వాళ్లు వెలుతున్నారు. విద్యార్థిని మీద కన్ను వేసిన కామాంధుడు ఆమెను క్లాస్ రూమ్ లోకి పిలుచుకుని వెళ్లాడు. విద్యార్థిని మీద ఒకే నెలలో నాలుగుసార్లు రేప్ చేశాడు. విద్యార్థి మీద టీచర్ రేప్ చేసే సమయంలో అదే స్కూల్ లో ఉద్యోగం చేస్తున్న మరో టీచర్ బ్రోకర్ అవతారం ఎత్తి క్లాస్ రూమ్ బయట కాపలా కుక్కలాగా ఉన్నాడు. విద్యార్ధి అనారోగ్యానికి గురి కావడంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి పిలుచుకుని వెళ్లి వైద్యపరీక్షలు చేయించారు. కూతురు గర్బవతి అని వెలుగు చూడటంతో తల్లిదండ్రులు షాక్ అయ్యారు.
Recommended Video

13 ఏళ్ల అమ్మాయి
రాజస్థాన్ లోని జోధ్ పూర్ జిల్లాలోని షేర్ ఘర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న 13 ఏళ్ల అమ్మాయి అదే ప్రాంతంలోని ఓ స్కూల్ లో ఆరవ తరగతి చదువుతోంది. స్కూల్ లో తమ కుమార్తె బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేస్తే మేము సుఖంగా ఉండవచ్చని తల్లిదండ్రులు బావించారు. స్కూల్ నుంచి ఇంటికి వెలుతున్న ఆ అమ్మాయి సాటి స్నేహితులతో కలిసి ఆడుకుంటోంది.

టీచర్ ముసుగులో కామాంధుడు
అమ్మాయి చదువుతున్న స్కూల్ లో సూరజరామ్ అనే కామాంధుడు టీచర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. 13 ఏళ్ల వయసులో చూడటానికి అమ్మాయి ఎత్తుగా, లావుగా ఉండటంతో ఆమె మీద సూరజరామ్ కన్ను పడింది. పాఠాలు చెప్పే నెపంతో అమ్మాయితో చనువుగా ఉంటున్న సూరజరామ్ ఆమెను కొంతకాలం నుంచి లైంగిక వేధింపులకు గురి చేశాడు.

నాలుగుసార్లు రేప్ చేసిన టీచర్
గత మార్చి నెలలో స్కూల్ అమ్మాయితో మాట్లాడాలని క్లాస్ రూమ్ లోకి పిలుచుకుని వెళ్లిన సూరజరామ్ ఆమె మీద అత్యాచారం చేశాడు. విషయం బయటకు చెబితే నిన్ను పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని, తరువాత చంపేస్తానని సూరజరామ్ బెదిరించాడు. అదే మార్చి నెలలో నాలుగు సార్లు అమ్మాయి మీద స్కూల్ లోనే అత్యాచారం చేశాడని వెలుగు చూసింది.

గర్బవతి అయ్యిందని తెలిసి షాక్ ?
అమ్మాయికి కడుపునోప్పి ఎక్కువ కావడంతో ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి పిలుచుకుని వెళ్లారు. ఎక్కడ మా అమ్మాయికి కరోనా వైరస్ వస్తుందో ? అని అమ్మాయి తల్లిదండ్రులు భయపడిపోయారు. అమ్మాయికి వైద్యపరీక్షలు చేసిన డాక్టర్లు ఆమె గర్బవతి అని చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు.

చంపేస్తామని వార్నింగ్..... బ్రోకర్ గా మారిన మరో టీచర్
స్కూల్ లో టీచర్ సూరజరామ్ తన మీద మార్చి నెలలో నాలుగు సార్లు రేప్ చేశాడని, విషయం బయటకు చెబితే పరీక్షల్లో ఫెయిల్ చేసి చంపేస్తానని బెదరించాడని అమ్మాయి చెప్పిందని జోధ్ పూర్ జిల్లా ఎస్పీ స్థానిక మీడియాకు చెప్పారు. సూరజరామ్ బాలిక మీద అత్యాచారం చేసే సమయంలో అదే స్కూల్ లో టీచర్ గా పని చేస్తున్న సాహీరామ్ అనే వ్యక్తి క్లాస్ రూమ్ బయట కాపాలా ఉన్నాడని బాలిక చెప్పిందని, కేసు విచారణలో ఉందని పోలీసు అధికారులు చెప్పారు.

సీఎం సొంత జిల్లాలో కలకలం
రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లెట్ సొంత జిల్లా జోధ్ పూర్ లో ఈ దారుణం జరగడం కలకలం రేపింది. అమ్మాయి కుటుంబ సభ్యులు కేసు పెట్టిన తరువాత టీచర్లు సూరజరామ్, సాహీరామ్ పరారైనారని, వారి కోసం గాలిస్తున్నామని జోధ్ పూర్ జిల్లా పోలీసు అధికారులు తెలిపారు. సూరజరామ్, సాహీరామ్ కోసం ప్రత్యేక పోలీసు టీమ్ లు వేట మొదలుపెట్టారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications