ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో స్టూడెంట్ ఆత్మహత్యయత్నం.. సేవ్‌చేసిన లోకోఫైలట్..
ఈ మధ్యకాలంలో తరచుగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడే సంఘటనలు చూస్తున్నాం. క్షణికావేశంలో వారు తీసుకున్న నిర్ణయాలు వారి జీవితాలనే మార్చేస్తున్నాయి. చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యలకు పాల్పడి వారి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. చిన్న వయసులోనే ఆత్మహత్యలకు సిద్ధపడి వారి తల్లిదండ్రులకు కడుపుకోతను మిగులుస్తున్నారు. అయితే, ఢిల్లీలో ఐఐటీ చదివే ఓ విద్యార్థి మెట్రో స్టేషన్‌లో ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. అయితే, ఈ విషయాన్ని గమనించిన లోక్‌పైలట్ ఆ స్టూడెంట్‌ను సేవ్ చేశాడు.
ఢిల్లీలోని ఐఐటీకి చెందిన 22 ఏళ్ల విద్యార్థి ఆదివారం బ్లూ లైన్ మెట్రో రైలులోని తిలక్ నగర్ స్టేషన్‌లో దూకి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. అయితే గమనించిన లోకో ఫైలట్ ఎమర్జెన్సీ బ్రేకులు వేసి ఆ విద్యార్థి ప్రాణాలను కాపాడాడు. ఈ సంఘటనలో ఆ విద్యార్థి తీవ్ర గాయాలపాలయ్యాడు. ఘటన జరిగిన వెంటనే గాయపడిన విద్యార్థిని సమీపంలోని ఆసుపత్రికి తరలించడం జరిగింది.

విద్యార్థి తలకు తీవ్రమైన గాయాలు : మెట్రో అధికారి ఇచ్చిన సమాచారం ప్రకారం ... ఆదివారం సాయంత్రం ఆరుగంటల నలభై నిమిషాలకు ఢిల్లీ ఐఐటీకి చెందిన 22 ఏళ్ల విద్యార్థి ఢిల్లీ మెట్రో రైలు ముందు దూకి ఆత్మహత్య కు ప్రయత్నించాడు. ఐఐటీ చదివే ఓ విద్యార్థి మెట్రో స్టేషన్‌లోని రెండవ నంబర్ ప్లాట్‌ఫారమ్‌పై నిలబడి ఉన్నాడు. ద్వారకకు వెళ్లే రైలు స్టేషన్‌లో ఆగబోయే సమయానికి రైలుకు ఎదురుగా దూకాడు. ఆ విషయాన్ని గమనించిన లోకోపైలట్ వెంటనే బ్రేకులు వేసి ఆ విద్యార్థిని ప్రమాదం నుంచి కాపాడాడు.
అయితే, ఈ ఘటనలో విద్యార్థి తలకు తీవ్రమైన గాయాలు కావడంతో వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. విద్యార్థి మెట్రో ముందు దూకిన సమయంలో మెట్రో వేగం చాలా తక్కువగా ఉందని, డ్రైవర్ ఆ అవకాశాన్ని వేస్ట్ చేయకుండా ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతో అతడి ప్రాణం కాపాడగలిగామని రైల్వే అధికారులు తెలిపారు. లేకపోతే తీవ్ర నష్టం జరిగేదని అన్నారు. అయితే, ఈ సూసైడ్‌కు ప్రయత్నించిన విద్యార్థి తమిళనాడుకు చెందిన వ్యక్తి అని తెలిసింది. ఈ విద్యార్థి ఢిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో బీటెక్ డిగ్రీని చదువుతున్నాడు. ఇలాంటి ఘటనలు జరగకుండా మెట్రో చాలా స్టేషన్లలో గ్రీన్ డోర్లు వేసినా మెట్రో నుంచి దూకే ఘటనలు మాత్రం ఆగడం లేదని అధికారులు వాపోతున్నారు.












Click it and Unblock the Notifications