Rajastan: ఇన్విజిలేటర్ చేసిన తప్పు విద్యార్థి జీవితాన్నే నాశనం చేసింది..
పిల్లల్ని తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తుంటారు. పిల్లల కూడా తల్లదండ్రులను అర్థం చేసుకుని చదువుతుంటారు. అయితే కొన్నిసార్లు అధికారుల తప్పిదం వల్ల తల్లిదండ్రులతో పాటు పిల్లల ఆశల్ని ఆవిరి చేస్తాయి. తాజాగా డాక్టర్ కావాలని కలలు కంటున్న ఓ విద్యార్థి కలను ఇన్విజిలేటర్ నాశనం చేశాడు. 18 ఏళ్ల ఆశాకిరణి దిశా శర్మ మే 7, 2023న నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ రాశారు. జైపూర్‌లోని రామనగరీయ ప్రాంతంలోని వివేక్ టెక్నో స్కూల్‌లో ఆమె నీట్ పరీక్షకు హాజరయ్యారు.
ఆమె మధ్యాహ్నం 2 గంటలకు పరీక్ష హాజరయింది. కొన్ని ప్రశ్నాలకు ఓఎమ్మార్ షీట్ లో సమాధానాలు బబుల్ చేసింది. ఆ సమయంలోనే ఇన్విజిలేటర్ టీ కప్ లో టీ తాగుతూ అటు ఇటు తిరుగుతున్నాడు. ఈ క్రమంలో టీ దిశా శర్మ ఓఎమ్మార్ షీట్ పై పడింది. దీంతో ఆమె బబుల్ చేసిన సమాధానాలు తొలిగిపోయాయి. 17 ప్రశ్నలు కూడా కనబడకుండా పోయాయి. దీంతో ఆమె ఇన్విజిలేటర్ కనీసం 5 నిమిషాల సమయం ఇవ్వాలని కోరినా అతను ఓఎమ్మాఆర్ షీట్ లాక్కున్నాడు.

ఇంత జరిగినా ఆమె పరీక్ష రాయడానికి అదనపు సమయం ఇవ్వలేదు. దీనిపై ఆమె పరీక్ష కేంద్రం ఇన్ ఛార్జ్ ను కూడా ప్రశ్నించింది. స్పందన రాలేదు. పాఠశాల ప్రిన్సిపల్ ను కూడా ఆమె ప్రశ్నించింది. అతని నుంచి కూడా సమాధానం రాలేదు. ఏమి చేయలేక దిశా ఇంటిముఖం పట్టింది. అయితే దీనిపై లాయర్ ను సంప్రదంచి రాజస్థాన్ హైకోర్టులో ఇన్విజిలేటర్ పై పిటిషన్ దాఖలు చేసింది. ఈ మొత్తం వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న జస్టిస్ ఎంఎం శ్రీవాస్తవ, జస్టిస్ అనిల్ ఉప్మాన్‌లతో కూడిన డివిజనల్ బెంచ్ దిశా ఒరిజినల్ ఓఎంఆర్ షీట్ సమర్పించాలని ఆదేశించింది.
పరీక్షా కేంద్రం నుంచి తరగతి గది వరకు ఉన్న సీసీటీవీ ఫుటేజీతో పాటు పాఠశాల ప్రిన్సిపాల్‌ను కూడా 2023 జూలై 4న కోర్టులో హాజరుపరచాలని స్పష్టం చేసింది. పరీక్ష జరిగేటప్పుడు అంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా అని ప్రశ్నించింది. దిశా శర్మ 12వ తరగతిలో 99 శాతం మార్కులు వచ్చాయి. ఎగ్జామినర్ పొరపాటు వల్ల డాక్టర్ కావాలనే కల అసంపూర్తిగా మిగిలిపోయింది.












Click it and Unblock the Notifications