కుక్కలు తిన్న మధ్యాహ్న భోజనాన్ని స్టూడెంట్స్ కు పెట్టారు: ఇదేం ఘోరం రా అయ్యా
ఛత్తీస్ గఢ్ లో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. వీధి కుక్కలు తిన్న ఆహారం, అవి సగం తిని వదిలేసిన కూరగాయాలు, ఇతర పదార్థాలతో వండిన మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు వడ్డించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ముందుజాగ్రత్త చర్యగా విద్యార్థులకు యాంటీ రేబిస్ ఇంజెక్షన్లు ఇచ్చారు అధికారులు.
ఛత్తీస్ గఢ్ బలోదా బజార్ లచన్‌పూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. వీధి కుక్కలు తిన్న మధ్యాహ్న భోజనాన్ని ఏకంగా 78 మంది విద్యార్థులకు వడ్డించారు. జూలై 19వ తేదీ ఈ ఘటన చోటు చేసుకోగా.. విద్యార్థులు అనారోగ్యానికి గురి కావడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పాఠశాల వంటగది సమీపంలో నిల్వ ఉంచిన కూరగాయలను వీధి కుక్కలు నాకాయి. కొన్నింటిని తిన్నాయి. దీన్ని చూసిన విద్యార్థులు ఉపాధ్యాయులకు తెలియజేశారు. ఉపాధ్యాయులు వంట మనుషులను హెచ్చరించినా, వారు మాత్రం ఆ కూరగాయలు ఉడకనివని చెప్పి, వాటినే వండి విద్యార్థులకు వడ్డించారు.
ఇంటికి వెళ్లిన తర్వాత విద్యార్థులు ఈ విషయాన్ని తమ కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో గ్రామస్థులు, తల్లిదండ్రులు ఉపాధ్యాయులకు, పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ జలేంద్ర సాహుకు ఫిర్యాదు చేశారు. తమ పిల్లల ఆరోగ్య భద్రత గురించి ఆందోళన చెందిన తల్లిదండ్రులు వారిని లచన్‌పూర్ ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు.
అక్కడ డాక్టర్ వీణా వర్మ పర్యవేక్షణలో 78 మంది విద్యార్థులకు రేబిస్ నిరోధక టీకా వేశారు. ఈ ఘటనపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల వంట మనుషులను తొలగించాలని, మధ్యాహ్న భోజన పథకాన్ని పర్యవేక్షించాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే సందీప్ సాహు ఈ విషయంపై ముఖ్యమంత్రికి లేఖ రాశారు.
ఈ ఘటనపై విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే, ఎవరి ఆదేశాల మేరకు పిల్లలకు రేబిస్ ఇంజెక్షన్లు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ దీపక్ నికుంజ్ పాలరి విచారణ ప్రారంభించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాల కమిటీ సభ్యుల వాంగ్మూలాలను ఆయన నమోదు చేశారు.
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్‌తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications