Students: కాలేజ్ లో డ్యాన్స్ ప్రోగ్రామ్స్, పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు, కాలేజ్ అమ్మాయికి !
బెంగళూరు: ఐటీ హబ్ బెంగళూరు నగరంలోని కొన్ని కాలేజ్ లో చదువుకోవాలని దేశంలోని ఇతర రాష్ట్రాల్లోని విద్యార్థులు, విదేశాలకు చెందిన యువతి యువకులు పోటీ పడుతున్న విషయం తెలిసిందే. బెంగళూరులో ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్న కాలేజ్ లు ఉన్నాయి. అలాంటి ఓ కాలేజ్ లో పాకిస్తాన్ జిందాబాద్ అని నినాదాలు చెయ్యడం కలకలం రేపింది. రెండు సెక్షల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు మరోసారి విచారణకు హాజరుకావాలని ముగ్గురు కాలేజ్ విద్యార్థులకు శనివారం నోటీసులు జారీ చేశారు.

కాలేజ్ లో సాంస్కృతిక కార్యక్రమాలు
బెంగళూరు సిటీలోని ఓ ప్రైవేట్ కాలేజ్ లో ఇటీవల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మాయిలు, అబ్బాయిలు ఆ సాంస్కృతిక కార్యక్రమాలు చూస్తూ ఎంజాయ్ చేశారు. పగటి పూట కాలేజ్ లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు, అమ్మాయిలు అబ్బాయిలు సాంస్కృతిక కార్యక్రమాలలో పోటీ చేసి అందరిని అలరించారు.

పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు
ఆ సందర్బంలో చెట్టుకింద నలబడిన ముగ్గురు విద్యార్థులు ఒక్కసారిగా పాకిస్తాన్ జిందాబాద్ అటూ నినాదాలు చెయ్యడంతో సాటి విద్యార్థులు బిత్తరపోయారు. పాకిస్తాన్ కు జిందాబాద్ లు చెప్పిన ముగ్గురు విద్యార్థుల్లో ఓ అమ్మాయి ఉండటంతో సాటి విద్యార్థులు షాక్ అయ్యి కాలేజ్ యాజమాన్యంకు సమాచారం అందించారు.

తమాషాకు చేశారా ?
కాలేజ్ యాజమాన్యం ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు ముగ్గురు విద్యార్థులను విచారణ చేశారు. కావాలనే పాకిస్తాన్ కు జిందాబాద్ లు చెప్పలేదని, తమషాకు విద్యార్థులు పాకిస్తాన్ జిందాబాద్ అని చెప్పారని, సాటి విద్యార్థులను ఆటపటించడానికి అలా చేశారని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది.

కేసు నమోదు.... విద్యార్థులకు నోటీసులు
రెండు సెక్షల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు మరోసారి విచారణకు హాజరుకావాలని ముగ్గురు కాలేజ్ విద్యార్థులకు శనివారం నోటీసులు జారీ చేశారు. మొత్తం మీద బెంగళూరులోని ఓ ప్రైవేట్ కాలేజ్ లో పాకిస్తాన్ జిందాబాద్ అంటూ ముగ్గురు విద్యార్థులు నినాదాలు చెయ్యడం కలకలం రేపింది.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
పాకిస్తాన్కు ఇరాన్ బిగ్ షాక్.. నో పర్మిషన్.. -
తెలంగాణా విద్యార్థులకు గుడ్ న్యూస్.. మధ్యాహ్న భోజనంలో చేపలు! -
ముగిసిన రంజాన్ సెలవులు.. మరోసారి పాకిస్థాన్ భీకర దాడి -
మొదటి రోజే పరువు పాయే! తెల్ల బంతి కాస్తా గులాబీగా మారింది! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..!












Click it and Unblock the Notifications