నేతాజీని "జాతీయ పుత్రుడి"గా ప్రకటించలేం.. బిగ్ షాక్ !!
స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ను 'జాతీయ పుత్రుడిగా' ప్రకటించాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (PIL) సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇటువంటి అంశాలు న్యాయ సమీక్ష పరిధిలోకి రావని, సంబంధిత అధికార యంత్రాంగంతో సంప్రదించాలని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది.
కాగా సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీ (INA) వల్లే భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందని పిటిషనర్ తన వాదనలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నేతాజీని "జాతీయ పుత్రుడిగా" ప్రకటించాలని, అక్టోబర్ 21, 1943 (INA స్థాపన దినం), జనవరి 23, 1897 (సుభాష్ చంద్రబోస్ జయంతి)లను జాతీయ దినాలుగా గుర్తించాలని కోర్టును అభ్యర్థించారు.

భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. గతంలో కూడా ఇలాంటి పిటిషన్లు దాఖలయ్యాయని గుర్తుచేసిన సీజేఐ.. ఇటువంటివి ప్రభుత్వ పరిధిలోని అంశాలని, న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవని స్పష్టంచేశారు. ప్రస్తుత వ్యాజ్యం కూడా అలాంటిదేనని పేర్కొంటూ కొట్టివేసింది. భవిష్యత్తులోనూ ఇలాంటి 'పనికిమాలిన' పిటిషన్లు మళ్లీ దాఖలు చేస్తే జరిమానాతో పాటు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని ప్రధాన న్యాయమూర్తి పిటిషనర్‌ను గట్టిగా హెచ్చరించారు.
కేవలం పబ్లిసిటీ కోసమే ఇలాంటి పిటిషన్లు దాఖలు చేస్తున్నారని న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇకపై ఇలాంటి ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను స్వీకరించవద్దని రిజిస్ట్రీని సీజేఐ ఆదేశించారు. తక్షణమే కోర్టు హాల్ నుంచి వెళ్లిపోవాలని.. లేకపోతే ఖర్చులు విధించాల్సి వస్తుందని పిటిషనర్‌కు సూర్యకాంత్ స్పష్టమైన వార్నింగ్ ఇచ్చారు.












Click it and Unblock the Notifications