Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బీజేపీలో 'సుబ్రహ్మణ్యస్వామి' దుమారం... పార్టీ ఐటీ సెల్‌పై సంచలన ఆరోపణలు.

బీజేపీ సొంత గూటిలోనే లుకలుకలు బయటపడుతున్నాయి. రాజ్యసభ ఎంపీ,బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి పార్టీ ఐటీ విభాగంపై పలు ఆరోపణలు చేశారు. అమిత్ మాలవియా నేత్రుత్వంలోని బీజేపీ ఐటీ విభాగం ఫేక్ ట్వీట్లతో తనపై దుష్ప్రచారం చేస్తోందని సుబ్రహ్మణ్యస్వామి ఆరోపించారు.

'బీజేపీ ఐటీ విభాగం దారుణంగా తయారైంది. అందులోని కొందరు వ్యక్తులు ఫేక్ ఐడీ ట్వీట్లతో నాపై వ్యక్తిగత దాడికి దిగుతున్నారు. పార్టీ ఐటీ సెల్ చేసే పనులకు బీజేపీ ఎలా బాధ్యత వహించదో... ఆగ్రహంతో నా అభిమానులు చేసే కౌంటర్ ఎటాక్స్‌కి నేను కూడా బాధ్యత వహించలేను.' అని సుబ్రహ్మణ్యస్వామి పేర్కొన్నారు.

Subramanian Swamy accuses BJP IT cell of running a campaign against him

అవేమీ పట్టించుకోవద్దని ఓ నెటిజన్ సుబ్రహ్మణ్యస్వామికి సలహా ఇవ్వగా... తాను అవేమీ పట్టించుకోవట్లేదని,కానీ బీజేపీ మాత్రం వాళ్లపై వేటు వేయాల్సిందేనని అన్నారు. అంతేకాదు,మాలవియా అనే పాత్ర దీనంతటికీ కారణమని ఆరోపించారు. మనం మర్యాద పురుషోత్తమ పార్టీకి చెందినవారమని... రావణ్ లేదా దుశ్వాసన్ పార్టీకి చెందినవారం కాదని మాలవియాకు కౌంటర్ ఇచ్చారు.

అయోధ్యలో రామ మందిరానికి,నరేంద్ర మోదీ ప్రభుత్వానికి సుబ్రహ్మణ్య స్వామి వ్యతిరేకమంటూ సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు హల్‌చల్ చేస్తున్న నేపథ్యంలో వరుస ట్వీట్లతో ఆయన స్పందించారు. ఆ వీడియోలను పోస్టు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ట్విట్టర్‌ను కోరారు. అయితే సుబ్రహ్మణ్యస్వామి ఆరోపణలపై అమిత్ మాలవియా మాత్రం ఇంతవరకూ స్పందించలేదు.

Recommended Video

    Ease Of Doing Business లో Andhra Pradesh స్థానం పై TDP వ్యాఖ్యలు || Oneindia Telugu

    గత కొద్దిరోజులుగా నీట్,జేఈఈ పరీక్షల నిర్వహణ విషయంలో సుబ్రహ్మణ్యస్వామి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన గొంతు వినిపిస్తున్నారు. కరోనా పరిస్థితుల్లో పరీక్షల నిర్వహణ సరికాదని,పరీక్షలను వాయిదా వేయాలని ప్రధాని మోదీకి లేఖ కూడా రాశారు. సరైన రవాణా సదుపాయాలు,హోటల్ సదుపాయాలు లేనందునా విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటారని... ఆత్మహత్యలకు పాల్పడే అవకాశం కూడా ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం పరీక్షల నిర్వహణ విషయంలో అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోలేదు. అటు సుప్రీం కూడా విపక్షాల రివ్యూ పిటిషన్‌ను కొట్టివేయడంతో పరీక్షలకు లైన్ క్లియర్ అయిన సంగతి తెలిసిందే.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+