రజనీకాంత్‌పై స్వామి సంచలనం, మాల్యా అరెస్ట్ ఆరంభమే, నెక్స్ట్ టార్గెట్..

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు సుబ్రహ్మణ్య స్వామి ప్రముఖ నటుడు, సూపర్ స్టార్ రజనీకాంత్ పైన సంచలన వ్యాఖ్యలు చేశారు.

మంగళవారం తమిళనాడులోని కలవై గ్రామంలో మీడియాతో మాట్లాడారు. రజనీకాంత్‌కు రాజకీయాల గురించి తెలియదని, ఆయన నటుడు మాత్రమేనని, రాజకీయ నాయకుడు కాదని వ్యాఖ్యానించారు.

తమిళనాడులో రాజకీయ నాయకులు గొప్ప నటులు అని ఎద్దేవా చేశారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసు నిందితుల గురించి కూడా ప్రస్తావించారు. ఆ కేసులో ఏడుగురు నిందితులు జైలు నుంచి విడుదలయ్యే అవకాశమే లేదన్నారు.

Subramanian Swamy hot comments on Rajinikanth and respond on Vijay Mallya arrest

ఇటీవల రజనీకాంత్‌ తన ఫ్యాన్స్‌ క్లబ్‌ ఆఫీస్‌బేరర్లతో సమావేశం నిర్వహణకు తేదీ, వేదికను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఆఖరి నిమిషంలో ఆ సమావేశాన్ని రద్దు చేశారు.

ఈ నెల 9వ, 10వతేదీల్లో శ్రీలంకలో పర్యటించాలని రజనీకాంత్ భావించారు. రాజకీయ పార్టీల ఆందోళనల నేపథ్యంలో పర్యటనను రద్దు చేసుకున్నారు.

విజయ్ మాల్యా అరెస్ట్‌పై సుబ్రహ్మణ్య స్వామి

పారిశ్రామిక వేత్త విజయ్‌మాల్యా అరెస్టుపై కూడా సుబ్రహ్మణ్య స్వామి స్పందించారు. అవినీతి నిరోధంలో ప్రధాని మోడీ చొరవను స్వామి కొనియాడారు. విజయ్ మాల్యా జైలుకు వెళ్లే సమయం దగ్గరపడిందన్నారు.

విజయ్‌ మాల్యా అరెస్టు ఆరంభం మాత్రమే, తుదపరి లక్ష్యం లలిత్ మోడీనే అని పేర్కొన్నారు. కాగా, వివిధ బ్యాంకులకు దాదాపు రూ.9వేల కోట్ల రుణాలు బకాయిపడి లండన్‌లో తలదాచుకున్న విజయ్ మాల్యాను స్కాట్లాండ్ పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత అరెస్టైన మూడు గంటల్లోనే ఆయనను విడుదల చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
BJP leader Rajinikanth and respond on Vijay Mallya arrest.
Please Wait while comments are loading...