మోడీ షాక్: భగవద్గీతను వల్లించిన సుబ్రమణ్యస్వామి

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన షాక్‌తో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలిచే భారతీయ జనతా పార్టీ ఎంపీ సుబ్రమణ్య స్వామి భగవద్గీతను తలచుకున్నారు. ఆయన వ్యాఖ్యలు వేదాంత దోరణిలో ఉండటం గమనార్హం. వ్యవస్థ కంటే తామే గొప్పవారమని అనుకోవడం సరికాదంటూ మోడీ చురకలంటించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో తనను మీడియా అవమానించిందని ఆరోపించారు. అందుకే తాను మీడియాతో మాట్లాడనని స్పష్టం చేశారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ కూడా త‌న తీరును త‌ప్పుబ‌ట్ట‌డంతో ఇక చేసేదేమీ లేక విమ‌ర్శ‌లు మాని.. భ‌గ‌వ‌ద్గీత‌ను వల్లించారు.

భగవద్గీత‌లో శ్రీకృష్ణుడు చెప్పిన‌.. 'సుఖ దుఃఖ స‌మే కృత్వ‌..' అనే శ్లోకాన్ని ఆయ‌న గుర్తు చేశారు. 'సుఖ‌దుఃఖాల‌కు తాను ఒకేలా స్పందిస్తాన‌ు'ని ఆయ‌న ట్వీట్ చేశారు. 'గెలుపోట‌ములు ఏవి ఎదురైనా, సంతోష‌మైనా.. బాధ క‌లిగినా యుద్ధం మాత్రం కొన‌సాగించాల‌ని కృష్ణుడు ఆ శ్లోకంలో వివ‌రిస్తాడు. తాను కూడా దాన్నే ఫాలో అవుతున్న‌ా'అన్నట్లు స్వామి చెప్పుకొచ్చారు.

ఇప్ప‌టివ‌ర‌కు త‌న వ్యాఖ్య‌ల‌పై ఎవ‌రు స్పందించినా వాళ్ల‌పై తిరిగి దాడి మొద‌లుపెట్ట‌డం స్వామికి అల‌వాటు. కానీ ఈసారి ప్ర‌ధానే ప‌రోక్షంగా త‌నను త‌ప్పుబ‌ట్ట‌డంతో ఆయ‌న‌ను ఏమీ అన‌లేక.. ఇలా త‌న‌ది కానీ స్టైల్లో ట్వీట్ చేశారు. ఇప్ప‌టికైతే ఆయ‌న కాస్త వెన‌క్కి త‌గ్గినా.. తొందర్లోనే మ‌ళ్లీ ఎవ‌రిపైనో విమర్శల దాడికి దిగ‌డం ఖాయ‌మ‌ని స్వామి గురించి బాగా తెలిసిన వాళ్లు చెబుతున్నారు.

ఇటీవల ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్‌పై చేసిన విమర్శలపై ప్రధాని మోడీ తొలిసారిగా ఘాటుగా స్పందించారు. రాజన్ తోపాటు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, ఆ శాఖ సీనియర్ అధికారులపై స్వామి చేసిన ఆరోపణలను మోడీ తప్పుబట్టారు. అంతేగాక, రఘురాం రాజన్ అసలైన దేశభక్తుడని మోడీ ప్రశంసించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+