వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టార్గెట్: కేజ్రీవాల్‌పై బాంబు పేల్చిన స్వామి

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బిజెపి నేత సుబ్రహ్మణ్య స్వామి తాజా టార్గెట్‌ అయ్యారు. ఐఐటి ఖరగ్‌పూర్‌లో 1980లో అడ్మిషన్ పొందిన ప్రక్రియకు, బిటెక్ (ఆనర్స్) డిగ్రీ పొందిన తీరుకు సంబంధించిన వివరాలను అందించాలని సుబ్రహ్మణ్య స్వామి కోరారు.

ఖరగ్‌పూర్ ఐఐటీలో విద్యను అభ్యసించిన కేజ్రీవాల్ మెరిట్ ఆధారంగా సీటు సంపాదించలేదని, నకిలీ కోటా కింద మాత్రమే సీటు సంపాందించారని 'దలాట్‌పాట్ డాట్ కామ్' అనే వెబ్‌సైట్‌ వార్తా కథనాన్ని ప్రచురించినట్లు మీడియాయలో వార్తలు వచ్చాయి. తమ కథనాన్ని బలం చేకూరేందుకు కేజ్రీవాల్ అడ్మిషన్‌పై ఆర్‌టిఐ రిప్లయ్ ప్రతిని కూడా పోస్ట్ చేసింది. అందులో కేజ్రీవాల్ ర్యాంక్ కార్డు రికార్డు లేదంటూ వార్తలు వచ్చాయి.

Subramanian Swamy Seeks Details Of Kejriwal's IIT Admission

అయితే చాలామంది విద్యార్థులకు ర్యాంకు కార్డు ఉంది. 2005లో కోటా సిస్టమ్‌ను నిషేధించారని, అయితే 1985లో ఐఐటి-ఖరగ్‌పూర్‌లో చేరారని కూడా వెబ్‌సైట్ పేర్కొంది. వెబ్‌సైట్ కథనంతో కేజ్రీవాల్‌పై బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణస్వామి శుక్రవారం విమర్శనాస్త్రాలు సంధించారు.

వెబ్‌సైట్ కథనంతో ఖరగ్‌పూర్‌లో కేజ్రీవాల్ ఎలా సీటు సంపాదించారనేది బహిర్గతమైందని స్వామి వ్యాఖ్యానించారు. మోడీ డిగ్రీ మీద రభస చేసిన కేజ్రీవాల్ ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. కేజ్రీవాల్ జీవితమంతా మోసాలతో కూడిందని, ఐఐటిలో తాను మెరిట్ విద్యార్థినని ఆయన చెబుతుంటారని, అయితే ఆయన ఎలా అడ్మిషన్ సంపాదించారనే సమాచారం తన వద్ద ఉందని స్వామి అన్నారు. దాన్ని మీడియా సమావేశంలో వెల్లడిస్తాడని చెప్పారు.

English summary
BJP leader Subramanian Swamy today sought details of the process by which Delhi Chief Minister got admission into IIT-Kharagpur in the 1980s and was awarded a B Tech (Hons) degree.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X