కొడుకును చంపిన లేడీ సీఈవో ఆమె కంపెనీలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చింది, ఐటీ హబ్ !
ఓ స్టార్టప్ కంపెనీ సీఈవో సుచనా సేఠ్ తన 4 ఏళ్ల కుమారుడిని చంపి, మృతదేహాన్ని సూట్‌కేస్‌లో తీసుకెళ్లిన ఉదంతం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. మరోవైపు తను పనిచేస్తున్న కంపెనీలో సుచనా సేఠ్ ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చింది ? అని ఇప్పుడు చర్చకు దారితీసింది. సొంత బిడ్డను చంపేసిన సుచనా సేఠ్ కంపెనీ సీఈవో కావడం హాట్ టాపిక్ అయ్యింది.
సుచనా సేఠ్ ఎవరు ?, ఆమె కంపెనీలో ఎంత మందికి ఉపాధి కల్పించింది అని తెలుసుకోవడానికి ఇప్పుడు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ కు చెందిన సుచనా సేఠ్ 12 ఏళ్ల క్రితం బెంగళూరుకు వచ్చింది. తరువాత బెంగళూరులోని కోరమంగళలోని ఓ కంపెనీలో డేటా ఉద్యోగిగా సుచనా సేఠ్ ఉద్యోగంలో చేరి చాలా కాలంపాటు అక్కడే పనిచేసింది.

2020లో బెంగళూరులోని రెసిడెన్సీ రోడ్‌లోని ఒక భవనంలో మైండ్‌ఫుల్ ఏఐ ల్యాబ్ అనే స్టార్టప్ కంపెనీని సుచనా సేఠ్ ప్రారంభించింది. అదే కంపెనీకి సుచనా సేఠ్ సీఈవోగా పని చేస్తోంది. సుచనా సేఠ్ కు చెందిన కంపెనీలో దాదాపు 30 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని ఆమె కంపెనీకి చెందిన వర్గాలు తెలిపాయని ప్రముఖ కన్నడ దినపత్రిక ప్రజావాణి నివేదించింది.
ఈ కేసుకు సంబంధించి గోవా పోలీసులు సుచనా సేఠ్ కు సంబంధించి ఎలాంటి సమాచారం, ఎక్కువ వివరాలు అడగలేదని కర్ణాటకకు చెందిన ఓ సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. గోవా పోలీసుల సూచనల మేరకు కుమారుడిని హత్య చేసిన సీఈవో సుచనా సేఠ్ ను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. సాధారణంగా ఏ తల్లిదండ్రులు తమ బిడ్డను చంపడానికి ఇష్టపడరు. అయితే ఈ కేసు నేపథ్యం ఏమిటి, సుచనా సేఠ్ ఆమె కన్న బిడ్డను చంపడానికి గల కారణాలేమిటో తెలియాల్సి ఉందని కేసు దర్యాప్తు చేస్తున్న ఓ పోలీసు అధికారులు అంటున్నారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications