'దేవదాస్' అలనాటి నటి సుచిత్రా సేన్‌కు అస్వస్థత

 Suchitra Sen suffers from ill health
కోల్‌కతా: అలనాటి ప్రముఖ సినీ నటి సుచిత్రా సేన్ తీవ్ర అస్వస్థతతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న ఆమె ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ వారం ప్రారంభంలో నగరంలోని బెల్యే వ్యూ క్లినిక్‌లో చేర్చారు. 82 ఏళ్ల సుచిత్రా సేన్ గత కొన్నేళ్లుగా బయటి ప్రపంచానికి దూరంగా తన అపార్ట్‌మెంట్‌లో ఒంటరిగా జీవిస్తున్నారు.

ఆమె ఆరోగ్య పరిస్థితిని 24 గంటలు గమనిస్తూ ఉండడం కోసం ఆస్పత్రి ప్రముఖ హృద్రోగ నిపుణుడు డాక్టర్ సుబ్రతా మొయిత్రా నేతృత్వంలో అయిదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఆమె ఆక్సిజన్‌పై ఉన్నారని, గుండెల్లో నొప్పిగా ఉందని చెప్పడంతో ఆమెకు సిటి స్కాన్ కూడా తీసారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

ప్రస్తుతం ఆమెకు యాంటీ బయాటిక్స్, ఆక్సిజన్ ఇస్తున్నట్లు వారు చెప్పారు. 1952లో బెంగాలీ సినిమా ‘శేష్ కొతాయి'తో సినీ జీవితం ప్రారంభించిన సుచిత్రా సేన్ 1955లో ‘దేవదాస్' హిందీ సినిమాలో నటనకుగాను జాతీయ అవార్డును సైతం అందుకున్నారు. 1963లో మాస్కో చలనచిత్రోత్సవంలో ‘సాత్ పాకే బందా' చిత్రంలో నటనకు గాను ఉత్తమ నటి అవార్డును అందుకోవడం ద్వారా ఒక అంతర్జాతీయ పిలింఫెస్టివల్‌లో అవార్డు అందుకున్న తొలి భారతీయ నటిగా చరిత్ర సృష్టించారు.

అయితే 1978లో సౌమిత్ర చటర్జీతో కలిసి నటించిన ‘ప్రణయ్ పాశ' సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఆమె ప్రజల దృష్టినుంచి దాదాపుగా తెరమరుగయ్యారు. అంతేకాకుండా 2005లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును సైతం తిరస్కరించి, మళ్లీ జనం మధ్యలోకి రావడానికి ఇష్టపడలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+