యువతలో సడెన్ డెత్ లు.. కొవిడ్ వ్యాక్సినేషన్ కారణమా..? ఎయిమ్స్ క్లారిటీ..
కొవిడ్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. ఈ వైరస్ బారినపడి లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే కరోనా వైరస్ విజృంభణ తర్వాత రోజులలో యువతలో ఆకస్మిక మరణాల సంఖ్య పెరగడం ఆందోళనకు దారితీస్తోంది. యువకులు ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. అయితే కొవిడ్ వ్యాక్సినేషన్ తీసుకున్న యువతే ఇలా అకాల మరణానికి గురవుతున్నారంటూ ఓ వాదన తెరపైకి వచ్చింది. అయితే తాజాగా ఇదే విషయంపై ఎయిమ్స్ సంస్థ పరిశోధన చేసింది. కీలక విషయాలను వెల్లడించింది.
యువతలో అకస్మాత్తు మరణాలకు కోవిడ్-19 టీకాకు ఎటువంటి శాస్త్రీయ సంబంధం లేదని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) తాజా అధ్యయనం తేల్చింది. యువతలో మరణానికి గుండె సంబంధిత కరోనరీ ఆర్టరీ వ్యాధే ప్రధాన కారణమని పరిశోధన గుర్తించింది. అయితే అధిక సంఖ్యలో యువకులు మృతి చెందడానికి గల కారణాలు మాత్రం అంతుచిక్కకుండా ఉన్నాయని.. మెరుగైన దర్యాప్తు అవసరం అని ఈ అధ్యయనం పేర్కొంది.
ఎయిమ్స్, దిల్లీలో ఒక సంవత్సరం పాటు నిర్వహించిన శవపరీక్షల ఆధారిత అధ్యయనం ద్వారా.. యువకులలో ఆకస్మిక మరణాలకు కోవిడ్-19 టీకాకు ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేదని తేల్చింది. ఇటువంటి మరణాలు అంతర్లీన గుండె సంబంధిత, ఇతర వైద్య కారణాల వల్లే సంభవిస్తాయని స్పష్టం చేసింది.
పోరెన్సిక్ మార్చురీ నుండి సేకరించిన శవపరీక్ష డేటా ప్రకారం.. 18 నుండి 45 సంవత్సరాల వయస్సు గల వ్యక్తుల్లో ఆకస్మిక మరణం ఇప్పుడు ప్రధాన ప్రజా ఆరోగ్య సమస్యగా మారింది. ఈ మరణాలు యువతలో అరుదుగా పరిగణించబడినప్పటికీ, ప్రస్తుత పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని అధ్యయనం వివరించింది.
అధ్యయన కాలంలో పూర్తి చేసిన 2,214 శవపరీక్షలలో, 180 కేసులు (8.1 శాతం) ఆకస్మిక మరణాల ప్రమాణాలకు సరిపోయాయి. ఈ ఆకస్మిక మరణాలలో 57.2 శాతం యువ వయోజనులలో సంభవించగా, 46- 65 సంవత్సరాల వయస్సు వారిలో 42.8 శాతం నమోదయ్యాయి. యువతలో ఆకస్మిక మరణాలు మొత్తం శవపరీక్ష కేసులలో 4.7 శాతంగా ఉన్నాయి. యువతలో ఆకస్మిక మరణాల సగటు వయసు 33.6 సంవత్సరాలుగా ఉంది.

అయితే యువతలో సంభవించిన సడెన్ మరణాల్లో దాదాపు మూడింట రెండు వంతులు గుండె సంబంధిత కారణాలే ఉన్నాయని పరిశోధకులు కనుగొన్నారు. కరోనరీ ఆర్టరీ వ్యాధి (CAD) కారణంగా మరణాలు సంభవించినట్లు తేల్చారు. అలాగే అరిథ్ మోజెనిక్ డిజార్డర్స్ (గుండె లయ లోపాలు), కార్డియోమయోపతి (గుండె కండరాల వ్యాధులు), పుట్టుకతో వచ్చే లోపాల కారణంగా యువతలో ఈ సడెన్ డెత్ లు జరుగుతున్నాయని వివరించారు. అలాగే ఆకస్మిక మరణానికి గురైన యువకుల్లో సగానికి పైగా ధూమపానం చేసేవారు. ఇక 50 శాతానికి పైగా మద్యం సేవించేవారు ఉన్నారు. ఇక సుమారు 40 శాతం మరణాలు రాత్రి లేదా తెల్లవారుజామున జరిగాయి. సగానికి పైగా మరణాలు ఇంట్లోనే సంభవించినట్లు అధ్యయనంలోనే తేలింది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications