చక్కెర ధరల మంటను అదుపు చేసేందుకు కేంద్రం సంచలన నిర్ణయం!

దేశంలో పెరుగుతున్న చక్కెర ధరలకు అడ్డుకట్ట వేయడంతో పాటు రాబోయే రోజుల్లో దేశంలో తీవ్రమైన చక్కెర కొరత తలెత్తకుండా ఉండేందుకు భారత ప్రభుత్వం మరో అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. రాబోయే 2026-27 సరఫరా సంవత్సరానికి గాను చెరకు రసం, షుగర్ సిరప్, బీ-హెవ్ మోలాసెస్ నుంచి ఇథనాల్ తయారీని పూర్తిగా నిలిపివేస్తూ కేంద్ర ఇంధన, ఆహార మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా కీలక ఉత్తర్వులు జారీ చేశాయి. దేశంలో మనుగడ సాగిస్తున్న చక్కెర నిల్వలు గణనీయంగా పడిపోవడం, పండుగ సీజన్‌లో వినియోగం పెరిగి ధరలు ఆకాశాన్నంటే ప్రమాదం ఉండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చింది. గత ఆగస్ట్ నెలలోనే నిల్వల కొరతను నివారించేందుకు ఓ మిలియన్ మెట్రిక్ టన్నుల ముడి చక్కెరను ఎటువంటి దిగుమతి సుంకం లేకుండా దిగుమతి చేసుకునేందుకు అనుమతి ఇచ్చిన కేంద్రం, ఇప్పుడు అదే రీతిలో ఇథనాల్ తయారీకి చెరకు మళ్లింపును పూర్తిగా సున్నాగా ప్రకటించి నిల్వలకు రక్షణ కవచం ఏర్పాటు చేసింది.

 డ‌యాబెటిస్ ఉన్న‌వారికి ఏ పండ్లు బెస్ట్..!?
డ‌యాబెటిస్ ఉన్న‌వారికి ఏ పండ్లు బెస్ట్..!?

ఇథనాల్ సేకరణకు కొత్త దారి
రాబోయే ఏడాదిలో దేశీయంగా ఇంధన అవసరాల కోసం ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల తరఫున భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ భారీ గ్లోబల్ టెండర్లను ఆహ్వానించింది. దాదాపు 11 బిలియన్ లీటర్ల ఇథనాల్ సేకరణ కోసం పిలిచిన ఈ టెండర్లలో చెరకు ఆధారిత ఉత్పత్తులను పూర్తిగా మినహాయించడం గమనార్హం. చెరకకు బదులుగా ఈ సారి మొక్కజొన్న, విరిగిన బియ్యం, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వద్ద అందుబాటులో ఉన్న మిగులు బియ్యం, సి-హెవీ మోలాసెస్ లను మాత్రమే ముడిసరుకులుగా ఉపయోగించి ఇథనాల్ తయారు చేయాలని చమురు కంపెనీలు స్పష్టం చేశాయి. దీనివల్ల ఇథనాల్ సరఫరాదారులు తమ ఉత్పత్తి విధానాలను, యంత్ర పరికరాలను తక్షణమే ధాన్యాల ఆధారిత విధానానికి మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Sugar Price Surge Government Bans Sugarcane for Ethanol Sugar Stocks Plunge Full Details Here

స్టాక్ మార్కెట్లో చక్కెర మిల్లుల షేర్ల పతనం
ప్రభుత్వం తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయం అక్టోబర్ 19న దేశీయ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. ఇథనాల్ విక్రయాల ద్వారా వచ్చే నిలకడైన ఆదాయంపైనే ఎక్కువగా ఆధారపడిన ప్రముఖ చక్కెర తయారీ కంపెనీల షేర్లు ఆటోమేటిక్‌గా పతనమయ్యాయి. మార్కెట్ ముగిసే సమయానికి శ్రీ రేణుకా షుగర్స్ 5.65 శాతం తగగి రూ.20.89 వద్ద నిలిచింది. బజాజ్ హిందుస్థాన్ షుగర్ 5.31 శాతం పడిపోయి రూ.20.14 వద్ద స్థిరపడింది. బలరాంపూర్ చిని మిల్స్ 3.42శాతం క్షీణించి రూ.698.05 వద్ద ముగిసింది. ఇతర కంపెనీలైన ధంపూర్, త్రివేణి, దాల్మియా వంటి సంస్థలకు స్వతంత్ర ధాన్య ఆధారిత డిస్టిలరీలు ఉండటంతో అవి ఈ నష్టాన్ని కొంతవరకు తట్టుకోగలవని, అయితే కేవలం చెరకు ఆధారిత మోలాసెస్ పైనే నడిచే మిల్లుల లాభదాయకతకు పెద్ద గండి పడే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ప్లాస్టిక్ నియంత్రణకు స్వీట్ ప్లాన్.. రెస్పాన్స్ అదుర్స్!
ప్లాస్టిక్ నియంత్రణకు స్వీట్ ప్లాన్.. రెస్పాన్స్ అదుర్స్!

ఆగస్టులో దిగుమతులు ఎందుకు?
ప్రముఖ క్రెడిట్ రేటింగ్ సంస్థ 'క్రిసిల్ ఇంటెలిజెన్స్'వెల్లడించిన వివరాల ప్రకారం.. 2025-26 సీజన్ నాటికి ఇండియాలో మిగిలిన చక్కెర నిల్వలు కేవలం 3.9 మిలియన్ టన్నులకు పడిపోయాయి. ఇది అంతకుముందు సీజన్ నిల్వల కంటే 25 శాతం తక్కువ కాగా.. గత ఐదేళ్ల సగటు నిల్వలు(6.5 మిలియన్ టన్నులు)తో పోలిస్తే ఏకంగా 40 శాతం తక్కువగా నమోదైంది. గత రెండు వ్యవసాయ సీజన్లలో వర్షాభావ పరిస్థితుల వల్ల చెరకు దిగుబడి తగ్గడం, పంట సాగు విస్తీర్ణం పడిపోవడమే దీనికి ప్రధాన కారణం.

మరోవైపు 2019-20లో ఇథనాల్ తయారీకి కేవలం 0.8 మిలియన్ టన్నుల చక్కెర మాత్రమే మళ్లించబడగా.. అది 2025-26 నాటికి ఏకంగా 3 మిలియన్ టన్నులకు పైగా దాటేసింది. ఉత్పత్తి తగ్గడం, మరోవైపు పెట్రోల్ బ్లెండింగ్ కోసం వినియోగం పెరగడంతో దేశీయంగా పంచదార ధరలు ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో గతేడాదితో పోలిస్తే జులై 2026 నాటికి 11 శాతం పెరిగాయి. ఈ ధరల మంటను అదుపు చేసి స్టాక్ కవరేజ్ ను 1.5 నెలల నుంచి 2 నెలలకు పెంచేందుకే ఆగస్టు 20, 2026న ప్రభుత్వం టారిఫ్ రేట్ కోటా కింద ఒక మిలియన్ టన్నుల ఉచిత దిగుమతులకు పచ్చజెండా ఊపింది.

ముందున్న సవాళ్లు.. E20 లక్ష్యం నెరవేరుతుందా?
దేశీయంగా పెట్రోల్ దిగుమతుల భారాన్ని తగ్గించుకోవడానికి భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన E20 లక్ష్యాన్ని దెబ్బతినకుండా చూస్తూనే దేశ ప్రజలకు సరిపడా చక్కెరను అందించడం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది. ధాన్యాల ఆధారంగా ఇథనాల్ ఉత్పత్తి చేయాలంటే తగినంత ముడిసరుకు లభ్యతతో పాటు ప్రైవేట్ రంగానికి భారీ పెట్టుబడులు అవసరమవుతాయి. దీనికి తోడు ప్రభుత్వం మొక్కజొన్న ఆధారిత ఇథనాల్ సేకరణ ధరను లీటరుకు రూ.71.86 నుంచి రూ.68.86కి తగ్గించడమే కాకుండా ఇన్సెంటివ్ ను కూడా రూ.5.79 నుంచి రూ.2.79కి కుదించింది. ఈ పరిణామాలు ఇథనాల్ తయారీదారుల నికర లాభాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో దేశీయంగా చక్కెర ఉత్పత్తి పుంజుకోవడం, ప్రత్యామ్నాయ ధాన్యాల లభ్యత పెరగడంపైనే భారతదేశపు ఇంధన-రైతు సంక్షేమ సమతుల్యత ఆధారపడి ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+