మహిళను చంపి.. శరీర భాగాలతో బిర్యానీ.. సినిమాను మించిన ట్విస్టులు బాబోయ్..
ఆగ్రా రైల్వే స్టేషన్ లో లభ్యమైన సూట్ కేసులో మహిళ మృతదేహం కేసులో దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలిశాయి. చెన్నై నుంచి దిల్లీ వెళ్తున్న రైలులో లభించిన ఆ సూట్ కేసులో మహిళ శరీర భాగాలు బయటపడిన కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు దాదాపు 350 కు పైగా సీసీటీవీ కెమెరాలను జల్లెడ పట్టారు. పదుల సంఖ్యలో అనుమానితులను విచారించారు. చివరికి నిందితుల ఇంటిని కనుగొన్నారు. అయితే విచారణలో భాగంగా ఆ ఇంటికి వెళ్లి చూడగా.. అక్కడ కనిపించిన దృశ్యాలు చూసి పోలీసులే షాక్ అయ్యారు. మహిళ శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసి చిందరవందరగా పడేశారు. అనుమానం రాకుండా కొన్ని శరీర భాగాలతో బిర్యానీ చేశారు. ఈ దృశ్యాలను చూసి పోలీసులు విస్మయానికి గురయ్యారు.
ఏం జరిగిందంటే..?
ఆగస్టు 5న చెన్నై నుంచి దిల్లీకి తమిళనాడు ఎక్స్ ప్రెస్ రైలు బయలుదేరింది. అలా ఉత్తర్ ప్రదేశ్ లోని ఆగ్రా రైల్వేస్టేషన్ కు చేరుకుంది. అయితే జనరల్ బోగీలో ఉన్న ఓ సూట్ కేస్ నుంచి తీవ్ర దుర్వాసన రావడంతో ప్రయాణికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సూట్ కేసును దించి పరిశీలించగా అందులో మహిళ మృతదేహానికి సంబంధించిన శరీర భాగాలు ఉండటం చూసి ఒక్కసారిగా కంగుతిన్నారు. వెంటనే దర్యాప్తు మొదలుపెట్టారు. దర్యాప్తులో ఆ సూట్ కేస్ చెన్నై నుంచే రైలులో పెట్టినట్లు గుర్తించారు. దీంతో ఆగ్రా పోలీసులు తమిళనాడు పోలీసులను సంప్రదించారు.
దాదాపు 350 కు పైగా సీసీ కెమెరాల ఫుటేజ్ పరిశీలించారు. ఓ పురుషుడు, ఓ మహిళ కలిసి సూట్ కేస్ తో స్టేషన్ కు వచ్చినట్లు గుర్తించారు. అలా తమిళనాడు ఎక్స్ ప్రెస్ లో సూట్కేసు ఉంచి.. చెన్నై పార్క్ రైల్వేస్టేషన్ నుంచి సబర్బన్ రైలు ఎక్కి గూడువాంజేరి చేరుకున్నట్లు సీసీటీవీల ద్వారా గుర్తించారు. అదే వ్యక్తులు సూట్ కేస్ తో ఓ ఆటోలో వెళ్తున్న దృశ్యాలను గుర్తించి చివరికి వాళ్లు నివసిస్తున్న ఇంటికి చేరుకున్నారు. ఇక అక్కడే హత్య జరిగినట్లు కీలక ఆధారాలు లభ్యం అయ్యాయి. బిర్యానీ పాత్రలో మానవ శరీరానికి సంబంధించిన ముక్కలు చూసి పోలీసులు షాక్ అయ్యారు.

ఇక హత్యకు గురైన మహిళ శరీరాన్ని ముక్కలుగా చేసిన తర్వాత.. కొన్ని భాగాలను సూట్ కేస్ లో పెట్టి రైలులో తరలించారు. మిగిలిన భాగాలను వండుతూ ఆనవాళ్లు లేకుండా చేసేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతురాలి తల మాత్రం ఇంకా లభించలేదు. దాని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇక మృతురాలు ఒడిశాకు చెందిన హయాత్ నిషాగా గుర్తించారు. ఆమె భర్త నుంచి విడిపోయి ప్రస్తుతం చెన్నైలో ఉంటోంది. అక్కడ నిషాతో మాణిక్ ఉత్తిన్ లస్కర్, అతని భార్య భాగమతి మాజిక్ నివసిస్తున్నట్లు దర్యాప్తులో పోలీసులు తేల్చారు. నిషాకు బంధువులైన వాళ్లిద్దరే ఆమెను హత్య చేశారని తమ దర్యాప్తులో పోలీసులు తేల్చారు.












Click it and Unblock the Notifications