Sumalatha: నాకు నా ప్రజలు అంటే ఇష్టం, నేను అంటే నా ప్రజలకు అభిమానం, తెలుగింటి ఆడపడుచు, ఎంపీ !
బెంగళూరు/ మండ్య: నాకు నన్ను గెలిపించిన నా నియోజక వర్గం ప్రజలు అంటే ఇష్టం, నేను అంటే ఇక్కడి ప్రజలకు ఇష్టం, నేను వాళ్లను వదలను, వాళ్లు నన్ను వదలరు, నేను నా నియోజక వర్గం వదిలేసి వేరే చోట పోటీ చెయ్యనని కర్ణాటకలోని మండ్య లోక్ సభ నియోజక వర్గం స్వతంత్ర పార్టీ ఎంపీ, తెలుగింటి ఆడపడుచు, బహుబాష నటి సుమలతా అంబరీష్ అన్నారు.
Recommended Video

బహుబాష నటి సుమలతా స్యాండిల్ వుడ్ రెబల్ స్టార్ ను పెళ్లి చేసుకున్న తరువాత బెంగళూరులో సెటిల్ అయిపోయారు. రెబల్ స్టార్ అంబరీష్ మరణించిన తరువాత ఆయన వారసురాలిగా మండ్య జిల్లాలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. గత లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హ్యాండ్ ఇవ్వడంతో సుమలతా అంబరీష్ ఆమె భర్త ఫోటో పెట్టుకుని స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేశారు.

మండ్య లోక్ సభ నియోజక వర్గం ఎంపీగా విజయం సాధించిన సుమలతా అక్కడి ప్రజల సమస్యలు పరిష్కరించడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం, కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు జరుపుతూనే ఉన్నారు. అయితే ఇటీవల మైసూరు-కోడుగు లోక్ సభ ఎంపీ (బీజేపీ) ప్రతాప్ సింహా మండ్య లోక్ సభ నియోజక వర్గంలో ఎక్కువగా తల దూర్చుతున్నారని ఆరోపణలు వచ్చిన సందర్బంగా మంగళవారం సుమలత మీడియాతో మాట్లాడారు.
నాకు నన్ను గెలిపించిన నా మండ్య లోక్ సభ నియోజక వర్గం ప్రజలు అంటే ఇష్టం, నేను అంటే మండ్య జిల్లా ప్రజలకు ఇష్టం, నేను వాళ్లను వదలను, వాళ్లు నన్ను వదలు అని సుమలతా అన్నారు. నేను మండ్య వదిలేసి వెళ్లిపోతానని కొందరు కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని, నా భర్త అంబరీష్ పేరు, నాపేరు వాడుకుంటే వాళ్లకు ఫ్రీగా పబ్లిసిటీ వస్తుందని ఆరాటపడుతున్నారని మండ్య లోక్ సభ ఎంపీ, బహుబాష నటి సుమలతా మండిపడ్డారు.












Click it and Unblock the Notifications