దేహంపై గాయాలు: సునందా మృతిపై అనుమానాలు

సునందా పుష్కర్ శరీరంపై గాయాలున్నాయని ఆయన చెప్పారు. గాయాలే మృతికి కారణమా అనేది పూర్తిస్థాయి పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత తేలుతుందని తెలిపారు. రెండు మూడు రోజులలోగా పూర్తి స్థాయి నివేదిక వస్తుందని వారు తెలిపారు. అనారోగ్యంతో మరణించిందన్న వార్తలలో వాస్తవం లేదని వైద్యులు చెప్పారు. పారదర్శకత కోసం పోస్ట్ మార్టంను వీడియో చిత్రీకరించినట్లు ఆయన తెలిపారు.
కాగా ఇటీవలే తమ ఆస్పత్రిలో సునందా పుష్కర్ పూర్తి స్థాయి వైద్య పరీక్షలు నిర్వహించుకున్నారని, ఆమెకు ఎలాంటి అనారోగ్యం లేదని కేరళలోని తిరువనంతపురంలోని కేరళ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్) వైద్యులు శనివారం తెలిపారు. ఆమెకు ఎలాంటి ప్రమాదకరమైన వ్యాధులు లేవని వారు పేర్కొన్నారు. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆమెకు సాధారణ మందులు ఇచ్చామని కార్డియాలజిస్ట్ డాక్టర్ జి విజయరాఘవన్ తెలిపారు.
జనవరి 12న ఆస్పత్రిలో అడ్మిట్ అయిన సునందా పుష్కర్ 14న డిశ్చార్జ్ అయ్యారని, ఆమెతోపాటు భర్త శశిథరూర్ కూడా ఉన్నారని తెలిపారు. ఆ సమయంలో సునందా ప్రశాంతంగా ఉన్నారని చెప్పారు. ఆమె మృతి తమకు షాక్‌కు గురి చేసిందని వైద్యులు తెలిపారు. కాగా సునందా కుమారుడు శివ ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నాడు. థరూర్ కుమారులు ఇశాన్, కనిష్క్ ఢిల్లీకి వెళ్లనున్నారు.
శుక్రవారం సాయంత్రం న్యూఢిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్‌లో మృతి చెందిన సునందా పుష్కర్‌ను ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)కు శనివారం ఉదయం 3.30 గంటలకు పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. ఎయిమ్స్‌లో పోస్టుమార్టం అనంతరం సునందా పుష్కర్ మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు శశిథరూర్ ఎయిమ్స్‌కు వచ్చారు. శనివారం సాయంత్రం సునందా పుష్కర్ పార్థీవ దేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం. సునందా మృతి పట్ల పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
కాగా తన భర్త శశిథరూర్‌కు.. పాకిస్థాన్ దేశానికి చెందిన ఓ మహిళ జర్నలిస్టుతో సంబంధం ఉందంటూ ట్విట్టర్‌లో సంచలన వ్యాఖ్యలు చేసిన రెండు రోజులకే ఆమె మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తోంది. తన భర్త తనకు దూరమవుతున్నాడని ఆందోళన చెందిన సునందా పుష్కర్.. ఆత్మహత్యకు పాల్పడ్డారా లేక మరేదైనా కారణం ఉండవచ్చా? అనే సందేహాలు నెలకొన్నాయి. కాగా సునందా పుష్కర్ మృతిపై పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. ఆమె మొబైల్ ఫోన్ డేటాను, మిగితా వివరాలను సేకరించి విచారణ జరుపుతున్నారు.












Click it and Unblock the Notifications