సునంద పుష్కర్ మృతి: శశిథరూర్‌ను విచారించిన పోలీసులు
న్యూఢిల్లీ: సునంద పుష్కర్ మృతి కేసులో ఢిల్లీ పోలీసులు ఆమె భర్త, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్‌ను ప్రశ్నించారు. అంతకుముందు ఢిల్లీకి చేరుకున్న శశిథరూర్ తన న్యాయవాదులతో సమావేశమయ్యారు. 2014లో సునంద పుష్కర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే.
సోమవారం సాయంత్రం సరోజిని నగర్ పోలీసు స్టేషన్‌కు పిలిపించి శశిథరూర్‌ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కాగా, సునంద మృతి కేసు దర్యాప్తును ముందుకు తీసుకుని వెళ్లే ప్రయత్నంలో భాగంగా ఢిల్లీ పోలీసులు ఆమె భర్త, కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు శశి థరూర్‌కు నోటీసు పంపించిన విషయం తెలిసిందే.

సునంద మృతి కేసులో ప్రశ్నించేందుకు మాత్రమే పోలీసులు ఆయనకు నోటీసు జారీ చేశారు. నోటీసు జారీ చేసిన విషయాన్ని ఢిల్లీ పోలీసు కమిషనర్ బిఎస్ బస్సీ ధ్రువీకరించారు. శశిథరూర్‌కు సిఆర్‌పిసి సెక్షన్ 160 కింద నోటీసు జారీ చేసినట్లు, కొద్ది రోజుల్లో శశి థరూర్‌ను ప్రశ్నించినున్నట్లు ఆయన తెలిపారు.
కేసు గురించి తెలిసిన వారందరినీ ప్రశ్నిస్తామని మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు సమాధానంగా బస్సీ సోమవారంనాడు అన్నారు. శశి థరూర్‌ను తర్వలో ప్రశ్నిస్తామని, అది రేపైనా ఎల్లుండైనా కావచ్చునని ఆయన అన్నారు. కేసు దర్యాప్తు ఓ కొలిక్కి వస్తుందని ఆయన చెప్పారు.
ఈ కేసులో చాలా మందిని ప్రశ్నించామని, మరింత మందిని వచ్చే రెండు రోజుల్లో ప్రశ్నిస్తామని బస్సీ అంతకు ముందు అన్నారు. తమ సిట్ కేసు దర్యాప్తు చేస్తోందని, త్వరలో ఓ నిర్ణయానికి వస్తుందని అన్నారు. ప్రతి విషయాన్ని సిట్ జాగ్రత్తగా పరిశీలిస్తోందని అన్నారు.












Click it and Unblock the Notifications