వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సునంద పుష్కర్ హత్య కేసు: ముగ్గురికి లై డిటెక్టర్ పరీక్షలు?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ భార్య సునందా పుష్కర్ హత్య కేసులో పోలీసులు ముందడుగు వేస్తున్నారు. ఈ కేసులో అన్ని వివరాలు తెలిసినప్పటికి దర్యాప్తుకు సహకరించడం లేదని, ఆ ముగ్గురికి లైవ్ డిటెక్టర్ పరీక్షలు నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని పోలీసులు కోర్టును ఆశ్రయించారు.

కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ భార్య సునందా పుష్కర్ అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. మొదట ఆమె ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు భావించారు. అయితే పోలీసుల దర్యాప్తులో కేసు కీలక మలుపు తిరిగింది.

కేసు దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ పోలీసులు కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ వ్యక్తిగత సహాయకుడు నారాయణ సింగ్, డ్రైవర్ భజరంగి, స్నేహితుడు సంజయ్ ధావన్ లకు అన్ని వివరాలు తెలిసినప్పటికి దర్యాప్తుకు సహకరించడం లేదని పోలీసులు అంటున్నారు.

Sunanda Pushkar Death: Lie Detector Test on 3 Witnesses

ఆ ముగ్గురు కేసు దర్యాప్తులో కీలమైన వ్యక్తులని, వారు సరైన సమాధానాలు వెల్లడిస్తే కేసు దర్యాప్తు కొలక్కి వస్తుందని ఢిల్లీ పోలీసులు అంటున్నారు. ఈ ముగ్గురిని ఎన్ని సార్లు విచారణ చేసినా సరైన సమాధానలు చెప్పడం లేదని పోలీసులు అంటున్నారు.

వారికి లైవ్ డిటెక్టర్ పరీక్షలు నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని పోలీసులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ నెల 20వ తేదిన కేసు దర్యాప్తులో భాగంగా ఆ ముగ్గురు వ్యక్తులు కోర్టు ముందు హాజరు కానున్నారు. అదే రోజు ముగ్గురిని కస్టడికి అప్పగించాలని పోలీసులు కోర్టు ముందు మనవి చేయనున్నారు.

English summary
The police have asked a Delhi court for permission to subject the Tharoors' domestic help Narain Singh, driver Bajrangi and family friend Sanjay Dewan to a polygraph test.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X