Super blue moon: కనుల విందుగా.. నిండు చందమామ
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా సూపర్ బ్లూ మూన్.. కనువిందు చేస్తోంది. సాధారణ పౌర్ణమి రోజులతో పోల్చుకుంటే పరిమాణంలో 40 శాతం పెద్దదిగా కనిపిస్తోంది. 30 శాతం అధికంగా వెలుగును పంచుతోంది చందమామ. వెన్నెలను వెదజల్లుతోన్న చంద్రుడిని వీక్షించడానికి జనం ఆసక్తి చూపుతున్నారు. టెలిస్కోప్, బైనాక్యులర్లకు పని చెప్పారు. మొబైల్ ఫోన్లతో జాబిల్లిని క్లిక్‌మనిపిస్తోన్నారు.
సాధారణంగా ఒక ఏడాదిలో రెండు లేదా మూడు సూపర్‌మూన్‌లు ఏర్పడుతుంటాయి. బుధవారం ఏర్పడబోయే సూపర్ బ్లూ మూన్ మాత్రం చాలా అరుదు. అలాంటి సందర్భాన్ని మళ్లీ 2032, 2037 వరకు మనం చూడలేకపోవచ్చు. ఫుల్ మూన్ సమయంలో, జాబిల్లి కక్ష్య భూమికి దగ్గరగా ఉన్నప్పుడు సూపర్‌మూన్ ఆవిష్కృతమౌతుంది.

ఒకే నెలలో రెండవసారి ఏర్పడే పున్నమి చంద్రుడిని బ్లూ మూన్‌గా భావిస్తారు. సగటున ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఇలాంటి సందర్భం ఏర్పడుతుంటుంది. ఒక సూపర్‌మూన్, బ్లూ మూన్‌తో కలిసి రావడం అరుదైన సందర్భమే. ఇది చివరిసారిగా 2009 డిసెంబర్‌లో ఇది సంభవించిందని నాసా పేర్కొంది. మళ్లీ 2032, 2037 ఆగస్టులో ఇది ఏర్పడుతుంది.
Chanda O Chanda... Super Blue Chanda.. #SuperBlueMoon
— Sandhya (@xsmahato) August 30, 2023
pic.twitter.com/5APYtyfLUd
నేటి పున్నమి చంద్రుడిని బ్లూ మూన్‌గా పిలుస్తారు. అంతే తప్ప చందమామ నిజంగా నీలం రంగులో కనిపించదు. చంద్రోదయమైన కొద్దిసేపటికే #SuperBlueMoon, #BlueMoon అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఈ హ్యాష్ ట్యాగ్ కింద నెటిజన్లు చంద్రుడి ఫొటోలను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై పోస్ట్ చేస్తోన్నారు.
#BlueMoon denotes that the moon will be at its closest proximity to Earth.
— Swati Lakra (@SwatiLakra_IPS) August 30, 2023
Have you seen the moon now?
Have taken this pic from my phone.....
Post your pics of the super blue moon 🌙 🌚 #SuperMoon #SuperBlueMoon pic.twitter.com/wzqKmCcVDT
తెలంగాణ అదనపు డీజీపీ స్వాతి లక్రా కూడా చంద్రుడిని తన మొబైల్ ఫోన్ కెమెరాలో బంధించారు. భూమికి అత్యంత సమీపానికి వచ్చినప్పుడు బ్లూ మూన్ ఆవిష్కృతమౌతుందని కామెంట్స్ పోస్ట్ చేశారు. తన మొబైల్ ఫోన్ నుంచి చంద్రుడి ఫొటో తీశానంటూ పేర్కొన్నారు.
-
కియారా బికీనీ వివాదం రీ ఓపెన్.. వర్మ మాటలతో మళ్లీ రచ్చ! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు -
సిగ్గుండాలి.. అనసూయ ఒక్క పోస్ట్‌తో సైలెన్స్! -
కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది -
'తల్లికి వందనం’ నిధుల జమ పై ప్రభుత్వం కీలక ప్రకటన, ఇక వారికీ..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి..












Click it and Unblock the Notifications