• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మహా క్లైమాక్స్..! మలుపులు తిరుగుతున్న డ్రామాకు శుభం కార్డ్ నేడే..!!

|

ముంబాయి/హైదరాబాద్ : మహారాష్ట్ర రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. సమస్య పరిష్కారం ఐపోయింది, నేతల మధ్య సఖ్యత కుదిరింది, ఇక ప్రభుత్వం ఏర్పాటు చేయడమే తరువాయి అనుకుంటున్న తరుణంలో మరో కొత్త సమస్య వచ్చి పడుతోంది. ఐతే ప్రస్తుతం నెలకొన్న పరిస్దితులను బట్టి గత ఇరవై రోజులగా మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ ప్రతిష్టంభనకు తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. బలనిరూపణ కోసం ఎన్సీపికి ఇచ్చిన చివరి గడువు నేటి రాత్రితో ముగిసిపోనుంది. గడువు దాటితే రాష్ట్రపతి పాలన తప్పేట్టు కనిపించడం లేదు. కాని కాంగ్రెస్, ఎన్సీపి మరియు శివసేన మధ్య కొనసాగుతున్న చర్చలు ఫలప్రదమయ్యే దిశగా ముందుకెళ్తున్నట్టు తెలుస్తోంది. అందుకోసం ముఖ్య నేతలు కీలక మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.

మహారాష్ట్ర రాజకీయాల్లో మహా ట్విస్ట్ లు..! బీజేపి హాండ్స్ అప్ ! రంగంలోకి సోనియా..!!మహారాష్ట్ర రాజకీయాల్లో మహా ట్విస్ట్ లు..! బీజేపి హాండ్స్ అప్ ! రంగంలోకి సోనియా..!!

ఊహించని మలుపులు.. మహా రాష్ట్రలో ఎన్నో ట్విస్టులు..

ఊహించని మలుపులు.. మహా రాష్ట్రలో ఎన్నో ట్విస్టులు..

ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు వీలుగా ప్రజలు ఇచ్చిన తీర్పు అస్పష్టంగా ఉండడంతో ఆ దిశగా అడుగులు వేయడం రాజకీయ పార్టీలకు కష్టంగా మారింది. దీంతో ఎక్కువ సీట్లు గెలుచుకున్న బీజేపి, మిత్రపక్షమైన శివసేనతో ప్రభుత్వ ఏర్పాటులో ఏకాభిప్రాయానికి రాలేకపోయింది. దీంతో బీజేపి పూర్తిగా చేతులెత్తేసింది. ఇప్పుడు బంతి ఎన్సీపి, కాంగ్రెస్ కోర్టులో ఉంది. గోల్ పోస్టులోకి బంతిని పంపేందుకు సోనియా గాంధీ రంగంలోకి దిగింది. అందుకు శరద్ పవార్ సహరకారాన్ని కోరుకుంటోంది కాంగ్రెస్ పార్టీ. నేటి సాయంత్రం వరకు గవర్నర్ ఇచ్చిన గడువులోపు చర్చల ప్రక్రియ పూర్తి చేసి ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి పమాచారాన్ని లిఖిత పూర్వకంగా గవర్నర్ కు అందజేయాల్సి ఉంది. లేక పోతే అన్ని పార్టీల నుండి మహారాష్ట్ర చేజారిపోయే ప్రమాదం పొంచి ఉంది.

కీలక డెడ్ లేన్లు.. ప్రతిష్టంభనకు తెరపడే అవకాశం..?

కీలక డెడ్ లేన్లు.. ప్రతిష్టంభనకు తెరపడే అవకాశం..?

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ శివసేనకు గవర్నర్ నుంచి ఆఫర్ వచ్చినంతనే, ఆ పార్టీ పరుగులు తీసింది. బీజేపీ గేమ్ ప్లాన్ ను సరిగా అర్థం చేసుకోవటంలో విఫలం చెందిన శివసేన, కాంగ్రెస్-ఎన్సీపీలు తమకు ప్రభుత్వ ఏర్పాటులో సహకరిస్తాయని విశ్వాసం వ్యక్తం చేసింది. అయితే కాంగ్రెస్ పార్టీ రాజకీయం ముందు మళ్లీ వెనక్కి తగ్గింది. ఇదే తరుణంలో మంగళవారం అంటే నేటి రాత్రి 8.30 లోపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన బలాన్ని చూపించాల్సిందిగా ఎన్సీపీని కోరారు మహారాష్ట్ర గవర్నర్. దీంతో ఇంతకాలం సాగిన మహా డ్రామా ముగింపునకు రావటమేకాదు, ఈ రాత్రికి ఫలితం తేలటం ఖాయమనే చర్చ జరుగుతోంది.

నేడు కాంగ్రెస్ కోర్ కమిటీ అత్యవసర భేటీ.. చక్రం తిప్పబోతున్న సోనియా..

నేడు కాంగ్రెస్ కోర్ కమిటీ అత్యవసర భేటీ.. చక్రం తిప్పబోతున్న సోనియా..

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశమవనుంది. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటుకు మద్దతివ్వాలంటూ శివసేన ఛీఫ్ ఉద్ధవ్ థాక్రే స్వయంగా కోరడంతో, ఈ విషయంపై చర్చించేందుకు ఈ రోజు కూడా భేటీ కానుంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక స్పష్టమైన నిర్ణయానికి వస్తుందని, ఆ వెంటనే ఎన్‌సీపీకి తమ నిర్ణయం తెలియజేస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మహారాష్ట్రలో తమ కూటమి పక్షమైన నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ (ఎన్సీపీ)తో మరోసారి సమావేశం కావాలని మాత్రం నిర్ణయించినట్టు సమాచారం. ఏదేమైనా ఏఐసీసీ అద్యక్షురాలు సోనియా గాందీ నేతృత్వంలో సమస్యకు పరిష్కరం కనుగొనే దిశాగా అడుగులు పడుతున్నట్టు సమాచారం.

మహా కీలక ముగింపు.. గడువు లోపు చర్చలు కొలిక్కి వచ్చే అవకాశం..

మహా కీలక ముగింపు.. గడువు లోపు చర్చలు కొలిక్కి వచ్చే అవకాశం..

రాజకీయాల్లో అనుభవం చక్రం తిప్పుతుందంటారు. మహారాష్ట్ర రాజకీయాల్లో సోనియా గాంధీ అచ్చం ఇలానే వ్యవహరించినట్టు తెలుస్తోంది. పొత్తుల అంశంలో ఒప్పందాలకు సంబంధించిన ఉత్తర ప్రత్యుత్తరాల వల్ల భవిశ్యత్తులో అనుకోని చిక్కులొచ్చిపడతాయని భావించిన కాంగ్రెస్ పార్టీ పొత్తుల విషయంలో శివసేనకు ఎలాంటి లిఖిత పూర్వక హామీ ఇవ్వలేదు. అందుకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమైంది. నేడు ఎన్సీపి కి విధించిన గడువులోపు ఓ కీలక నిర్నయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. పొత్తుల అంశంలో లికిత పూర్వక ఒప్పందాలు శివసేనకు ఇవ్వడం కన్నా ఎన్సీపి నేత శరద్ పవార్ కి ఇవ్వడం సురక్షితంగా ఉంటుందని కాంగ్రెస్ విశ్వసిస్తోంది. అందుకే నేటి చర్చలు ఫలప్రదం దిశగా ముందుకు వెళ్లి మహా క్లైమాక్స్ కు శుభం కార్డ్ పడే దిశగా సోనియా గాంధీ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

English summary
There are opportunities to open up the political stalemate in Maharashtra for the past twenty days depending on the prevailing situation. The last deadline given to NCP for the strength of proof will end with today's night. The ongoing talks between the Congress, NCP and Shiv Sena seem to be leading towards fruition. And the main leaders seem to be in key negotiations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X