రజనీకాంత్‌కు అస్వస్థత.. చెన్నై ఆస్పత్రిలో చేరిక
సూపర్ స్టార్ రజనీకాంత్ అస్వస్థతకు గురయ్యారు. కలతగా ఉండటంతో ఆస్పత్రిలో చేరారు. చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. విషయం తెలిసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కానీ సాధారణ పరీక్షల కోసమే ఆస్పత్రికి వచ్చామని ఫ్యామిలీ మెంబర్స్ చెబుతున్నారు. అనారోగ్యంగా ఉండటంతో తీసుకొచ్చామని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. కానీ ఫ్యాన్స్ మాత్రం ఏమైందనే ఆందోళన వెంటాడుతూనే ఉంది.
రెగ్యులర్ చెకప్ కోసం తీసుకొచ్చామని ఫ్యామిలీ చెబుతుండగా.. అభిమానులు మాత్రం నమ్మడం లేదు. ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టిన.. భయాందోళనలు మాత్రం ఉన్నాయి. మరోవైపు రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపారు. దీంతో అభిమానులు కాస్త శాంతించారు.

Recommended Video
గత కొన్నాళ్లుగా రజనీకాంత్ రక్తపోటులో హెచ్చుతగ్గుల సమస్య ఎదుర్కొంటున్నారు. గతేడాది కూడా హైదరాబాద్లో షూటింగ్ కోసం వచ్చి అస్వస్థతకు గురయ్యారు. ఆ సమయంలో అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. అనారోగ్య కారణాల వల్లే రాజకీయ పార్టీ ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఇటీవలే ఆయన ఢిల్లీలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకున్న స్వీకరించిన సంగతి తెలిసిందే. రజనీ తదుపరి మూవీ అన్నాతే షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.












Click it and Unblock the Notifications