రజనీకాంత్ కన్నడ బాష అభిమానం: అదే రాజకీయం, బెంగళూరు టార్గెట్, ఎంట్రీ !

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు/చెన్నై: సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ తాను రాజకీయాల్లోకి వస్తానని, ప్రజాసేవ చేస్తానని కచ్చితంగా చెప్పారు. అయితే తన రాజకీయ పార్టీ తమిళనాడుకు మాత్రమే పరిమితం అని ఇప్పటి వరకూ రజనీకాంత్ ఎక్కడా చెప్పలేదు. రజనీకాంత్ త్వరలో కర్ణాటకలో జరగబోయే శాసన సభ ఎన్నికల్లో తన పార్టీ అభ్యర్థులను పోటీ చేయించి అదృష్టాన్ని పరీక్షించుకుంటారని సమాచారం.

కొత్త రాజకీయ పార్టీ

కొత్త రాజకీయ పార్టీ

తాను ఏ రాజకీయ పార్టీలో చేరనని, కొత్త పార్టీ పెడుతానని ఇప్పటికే రజనీకాంత్ ప్రకటించారు. తమిళనాడులోని 234 శాసన సభ నియోజక వర్గాల్లో మా పార్టీ పోటీ చేస్తోందని రజనీకాంత్ చెప్పారు. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చెయ్యాలా ? వద్దా ? అనే విషయం రజనీకాంత్ ఇప్పటి వరకూ ప్రకటించలేదు.

 ప్రాంతీయ పార్టీ కాదు ?

ప్రాంతీయ పార్టీ కాదు ?

సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ కు దేశ విదేశాల్లో కోట్లాది మంది అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. తాను కొత్తగా స్థాపించే పార్టీ కేవలం తమిళనాడుకు మాత్రమే పరిమితం అని రజనీకాంత్ ఇప్పటి వరకూ ఎక్కడా చెప్పలేదు.

 మరాఠి, కన్నడ దెబ్బ

మరాఠి, కన్నడ దెబ్బ

గతంలో కావేరీ, హోగేనికల్ నీటి పంపిణి వివాదంపై తమిళనాడులో జరిగిన పోరాటాల సందర్బంలో రజనీకాంత్ కొన్ని సార్లు మౌనంగా ఉన్నారు. ఆ సందర్బంలో కర్ణాటకలో జన్మించిన రజనీకాంత్ కన్నడిగులకు మద్దతుగా ఉంటున్నారని, తమిళ ప్రజల కోసం ఏ మాత్రం పోరాటం చెయ్యడానికి ముందుకు రాలేదని అనేక మంది రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు విమర్శించారు.

 రజనీకాంత్ క్లారిటీ

రజనీకాంత్ క్లారిటీ

తాను కన్నడిగుడు అని విమర్శించిన వారికి రజనీకాంత్ సరైన సమాధానం ఇచ్చారు. తాను కర్ణాటకలో జన్మించినా, మరాఠి అయినా తమిళ ప్రజలు తనను ఎంతగానో ఆదరించారని, తాను తమిళ ప్రజల పక్షపాతి అని రజనీకాంత్ ప్రత్యర్థులకు దీటైన సమాధానం చెప్పారు.

 కన్నడ అభిమాని

కన్నడ అభిమాని

తన విద్యాభ్యాసం పూర్తిగా కన్నడ బాషలోనే జరిగిందని, కన్నడ సూపర్ స్టార్ డాక్టర్ రాజ్ కుమార్ తో తనకు ఉన్న సన్నిహిత సంబంధాలను ఇటీవల రజనీకాంత్ గుర్తు చేసుకున్నారు. తన బాషాభిమానాన్ని ఎవ్వరూ వేలెత్తి చూపించాల్సిన అవసరం లేదని రజనీకాంత్ స్పష్టం చేశారు.

తమిళ ప్రజలు

తమిళ ప్రజలు

తాను బెంగళూరులో పుట్టి పెరిగినా తమిళ ప్రజలు తనకు అండగా నిలిచారని, తమిళనాడు ఆదరించడం వలనే తాను ఈ స్థాయిలో ఉన్నానని రజనీకాంత్ ఇటీవల అన్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చి తమిళ ప్రజలకు సేవ చేస్తానని రజనీకాంత్ స్పష్టం చేశారు.

కర్ణాటకలో పోటీ !

కర్ణాటకలో పోటీ !

2018 కర్ణాటకలో శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి. కర్ణాటకలో జరిగే శాసన సభ ఎన్నికల్లో రజనీకాంత్ కొత్తపార్టీ అభ్యర్థులు పోటీ చేసే అవకాశం ఉందని తెలిసింది. రజనీకాంత్ కర్ణాటకలోనే తన రాజకీయ జీవితం ప్రారంభించడానికి ఆస్కారం ఉందని సమాచారం.

బెంగళూరులో పోటీ !

బెంగళూరులో పోటీ !

బెంగళూరు నగరంలోని గాంధీనగర్, శాంతినగర్, సీవీ రామన్ నగర్, సర్వజ్ఞనగర్, బోమ్మనహళ్ళి శాసన సభ నియోజక వర్గాల్లో, కోలారు జిల్లాలోని కేజీఎఫ్ నియోజక వర్గంలో తమిళ ప్రజలు ఎక్కువగా నివాసం ఉంటున్నారు. ఇక్కడ ఎవరు విజయం సాధించాలన్నా తమిళ ప్రజల ఓట్లు కీలకం కానున్నాయి.

కన్నడ, తమిళ సెంటిమెంట్ !

కన్నడ, తమిళ సెంటిమెంట్ !

కన్నడ బాష మీద ఉన్న అభిమానాన్ని రజనీకాంత్ పదేపదే ప్రస్తావించారు. తమిళ, కన్నడ సెంటిమెంట్ తో కర్ణాటకలో జరిగే శాసన సభ ఎన్నికల్లో రజనీకాంత్ కొత్త పార్టీ సుమారు 14 శాసన సభ నియోజక వర్గాల్లో పోటీ చేసే అవకాశం ఉందని తెలిసింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Tamil superstar Rajinikanth announced his foray into politics. The actor in his recent public speeches had played up his Kannada roots, describing how he had touched Kannada iconic actor Dr. Rajkumar's feet before becoming an actor. Is Rajinikanth political stint starts from Karnataka Assembly elections 2018? A big question..

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి