వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారీ భవనం - 10 సెకండ్లలో నేలమట్టం : నోయిడా జంట భవనాల కూల్చివేత..!!

|
Google Oneindia TeluguNews

నోయిడా జంట భవనాల కూల్చివేతకు రంగం సిద్దమైంది. మొత్తం 100 మీటర్ల భవనం కేవలం 10 సెంకడ్లలో నేల మట్టం కానుంది. నోయిడాలో అక్రమంగా నిర్మితమైన వంద మీటర్ల పొడవైన జంట టవర్ల కూల్చివేతకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నోయిడాలో సూపర్‌టెక్‌ సంస్థ అక్రమంగా నిర్మించిన జంట భవనాల కూల్చివేతకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజల్లో దడ మొదలైంది. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఈ జంట భవనాలను ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకి కూల్చివేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు.

కూల్చివేతకు రంగం సిద్దం

కూల్చివేతకు రంగం సిద్దం

కూల్చివేతపై ఎలాంటి భయాలు వద్దని తాము చేపట్టిన ప్రక్రియ 150 శాతం సురక్షితమైనదని కూల్చివేతను చేపట్టిన ఇంజనీరింగ్ సంస్థ హామీ ఇస్తోంది. నిర్మాణంలో అక్రమాలు జరిగితే పడగొట్టకుండా ప్రత్యామ్నాయ మార్గం ఏదైనా ఆలోచించి ఉంటే బాగుండేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. బటన్‌ నొక్కగానే పేకమేడల్లా ఈ భవనాలు కూలిపోతాయి. మధ్యాహ్నం 2.30 గంటలకి కూల్చివేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఒక్క బటన్‌ నొక్కడంతో 100 మీటర్లకు పైగా పొడవైన ఆ భవనాలు కేవలం 10 సెకండ్లలోపే పేకమేడల్లా నేలమట్టం కానున్నాయి.

సెకండ్లలో కూల్చివేత

సమయం, భద్రత అంశాలను దృష్టిలో ఉంచుకొని పేలుడు పదార్థాల ద్వారా ''కంట్రోల్డ్‌ ఇంప్లోజన్‌ '' (వాటర్‌ఫాల్‌ ఇంప్లోజిన్‌) విధానంతో కొన్ని సెకండ్లలో కూల్చేయనున్నారు. ఈ టెక్నిక్‌ను 1773లో ఐర్లాండ్‌లోని వాటర్‌ఫోర్డ్‌లో హోలీ ట్రినిటీ కేథడ్రాల్‌ భవనం కూల్చివేతకు తొలిసారిగా ఉపయోగించారు. వంతెనలు, సొరంగాలు, భవనాలు, ఇతర నిర్మాణాలను కూల్చివేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఈ విధానమే అత్యంత భద్రమైనదని తేలింది. 2012లో నోయిడా జంట భవనాల నిర్మాణం జరిగింది. రెండు ట్విన్ టవర్స్ లో ఒకటి అపెక్స్ 32 అంతస్థులు ఉండగా...రెండోది సియాన్ 29 అంతస్థులు ఉంది.

సెకండ్ల సమయంలో కూల్చేస్తాం

భవనాల కూల్చివేతకు 9,600 రంధ్రాలు చేసారు. 3,700 కేజీలకు పైగా పేలుడు పదార్ధాలు నింపారు. టవర్స్‌ నిర్మాణానికి రూ 70 కోట్లు వ్యయం చేసారు. కాగా.. కూల్చివేతకు ఖర్చు రూ.20 కోట్లుగా అంచనా వేసారు. శిథిలాలు 55,000 నుంచి 80 వేల టన్నులు వరకు ఉంనున్నాయి. శిథిలాల తరలింపునకు మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో..ఇప్పటికే పెద్ద ఎత్తున అక్కడకు కూల్చివేతకు అవసరమైన ఏర్పాట్లు చేసారు. ఈ కూల్చివేత ప్రక్రియ పైన దేశ వ్యాప్తంగా ఆసక్తి కనిపిస్తోంది.

English summary
Noida Supertech Twin Towers demolition: The collapse will last for nine seconds, the project's engineer has said, and another 12 minutes for the dust to settle.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X